ఇంట్లోనే గోదుమ పిండితో కచోరీని ఎప్పుడైనా చేసుకున్నారా..?

Posted By:

రోడ్డు పైన వెళ్తుంటే రాజస్తానీ సమోసా, కచోరీ చూడగానే నోరూరిపోతుంది. ఎప్పుడు తినాలా అని మనసు లాగేస్తుంది. కచోరీని ఇంట్లోనే తయారు చేసుకోవ్చు. గొదుమ పిండి కచోరీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడ మేము మీకు అందిస్తున్నాం.

కచోరి కోసం కావాల్సిన పదార్ధాలు

1.1/2 కప్పు గోదుమ పిండి
మంచి నూనె
ఉప్పు, వాము
1/2 టీస్పూన్ జిలుకర
పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు
1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
సన్నగా తరిగిన ఒక ఆలుగడ్డ ముక్కలు
1/4 కప్పు క్యారెట్ ముక్కలు,
1/4 కప్పు క్యాప్సికం ముక్కలు,
1 కప్పు క్యాబేజీ తురుము
1/2 టీ స్పూన్ మిరియాల పొడి
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు,
2 టీస్పూన్ల నిమ్మకాయ రసం,

కచోరీ తయారు చేసే విధానం

1. మిక్సింగ్ బౌల్‌లో 1.1/2 కప్పు గోదుమ పిండిని తీసుకోవాలి.
2. 1/4 కప్పు బొంబాయ్ రవ్వను తీసుకోవాలి.
3. వేడి చేసిన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి, రుచికి సరిపడ ఉప్పు, అరటీస్పూన్ వామును నలిపి వేయాలి.
4. బౌల్‌లో పిండి మొత్తం బాగా కలపాలి.
5. బౌల్‌లో కొన్ని కొన్ని నీళ్లను యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి.
6. చపాతీ పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
7. స్టవ్‌పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ మంచి నూనెను పోసి, అందులో 1/2 టీస్పూన్ జిలుకర వేయాలి, కొన్ని
8. పచ్చిమిరపకాయ ముక్కలను, కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
9. 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
10. సన్నగా తరిగిన ఒక ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి.
11. 1/4 కప్పు క్యారెట్ ముక్కలను, 1/4 కప్పు క్యాప్సికం ముక్కలను, 1 కప్పు క్యాబేజీ తురుమును తీసుకోవాలి.
12. కూరగాయలన్నింటినీ వీలయినంత సన్నగా తరుక్కోవాలి.
13. ఇందులో రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి.
14. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
15. బాగా ఉడకడానికి 2 టేబుల్ స్పూన్ల నీళ్లను యాడ్ చేసుకోవాలి.
16. 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులను, 2 టీస్పూన్ల నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి.
17. తయారైన స్టఫ్‌ను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.
18. కలుపుకున్న పిండిని కచోరీ కోసం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
19. ఒక్కో పిండి ముద్దను తీసుకొని పూరీ సైజులో చేసి స్టఫ్ అందులో పెట్టి క్లోజ్ చేయాలి.
20. ఇప్పుడు వీటిని కడాయిలో నూనె బాగా వేడయిన తరువాత వేసి ఫ్రై చేసుకోవాలి.
21. కచోరీలు మాడిపోకుండా జాగ్రత్త పడాలి.
22. ఇక దీంతో కచోరీలు రెడీ అయినట్టే.
23. పచ్చి మిరపకాయలను వేయించుకొని కరోరీలతో నంచుకొని తినవచ్చు.

[ of 5 - Users]
Story first published: Tuesday, June 25, 2024, 18:45 [IST]
Desktop Bottom Promotion