మీ కంటిచూపుని బాగా పెంచే కరివేపాకు కారం పొడి..పాత కాలం పద్థతిలో ఇలా చేసుకోండి

Posted By:

మనదేశంలో ఏ కూర లేదా పచ్చడి లేదా మరే ఇతర వంటకం అయినా అందులో కరివేపాకు ఉండి తీరాల్సిందే. కరివేపాకు వంటల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆహార పదార్థాల్లో కరివేపాకు వినియోగిస్తారు. జట్టు సమస్యలు, కంటి చూపు సమస్యలకు కరివేపాకు దివ్యౌషదం. కరివేపాకుతో పొడులు కూడా తయారుచేస్తారు. ఇడ్లీల్లోకి నంచుకోడానికి అయినా లేదా వేడి వేడి అన్నంలోకి అయినా కరివేపాకు కారం సూపర్ గా ఉంటుంది. పాతకాలం పద్దతిలో కరివేపాకు కారం ఎలా చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏవో ఇక్కడ చూడండి.

కరివేపాకు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు

-కరివేపాకు
-ధనియాలు
-జీలకర్ర
-వెల్లుల్లి
-ఎండుమిర్చి
-ఉప్పు
-చింతపండు

కరివేపాకు కారం తయారీ విధానం

- ముందుగా 2 మీడియం సైజ్ కట్టల అంత అంటే చేతినిండా కరివేపాకు శుభ్రంగా కడిగి ఏదైనా గుడ్డలో వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టండి.

-తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మంటను లో ప్లేమ్ మీద పెట్టి బాగా దోరగా వేయించి వాటిని తీసి ఓ గిన్నెలో వేసి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించి ఓ బౌల్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు తుంచిన 20-25 ఎండు మిరపకాయలు వేసి 1 టీస్పూన్ ఆయిల్ వాటి మీద వేసి బాగా వేయించి వాటిని ఓ బౌల్ లోకి తీసి పెట్టుకోండి.

-తర్వాత అదే బాండీలో 2 టీస్పూన్ల ఆయిల్ పోసి అది కొంచెం వేడయ్యాక అందులో కరివేపాకు వేసి బాగా క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించి దానిని ఏదైనా ఫ్లేట్ లోకి తీసుకోని పక్కనపెట్టుకోండి.

-తర్వాత వేయించినవన్నీ చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో.. వేయించిన ధనియాలు, జీలకర్ర,ఎండుమిర్చి,రుచికి సరిపడా ఉప్పు వేసి వాటన్నింటిని ఒకసారి గ్రైండ్ చేయండి.

-తర్వాత అందులోనే వేయించిన కరివేపాకు,ఉసిరికాయంత సైజు చింతపండు కూడా వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా కాకుండా లైట్ గా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత అందులో 20 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసి 2 సార్లు మిక్సీ పల్స్ తిప్పుకోండి. అంతే కరివేపాకు కారం రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, January 1, 2025, 10:37 [IST]
Desktop Bottom Promotion