Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కేరళ స్టైల్ కాలతప్పం స్వీట్.. ఎప్పుడైనా తిన్నారా..?
కాలతప్పం స్వీట్ కేరళలో చాలా ప్రత్యేకమైన స్వీట్ వంటకం. మలబార్ ప్రాంతంలో ఈ డిష్ పుట్టిందని చెబుతుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి పండుగలు, వివాహాల్లో ఈ స్వీట్ ను చేసుకుంటూ వస్తున్నారు. కాలతప్పం చేయడానికి బియ్యం పిండిని, బెల్లాన్ని, కొబ్బరి పాలను ఉపయోగిస్తారు. కాలతప్పంను చాలా సింపుల్గా త్వరగా తయారు చేసుకోవచ్చు. మరి కాలతప్పం మిఠాయ్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కాలతప్పం స్వీట్ తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్ధాలు :
బియ్యం: 1 కప్పు
బెల్లం: 1 కప్పు
నీరు: 1 కప్పు
కొబ్బరి తురుము: 1/2 కప్పు
ఏలకులు: 4-5
ఉప్పు: చిటికెడు
నెయ్యి: 2 టీస్పూన్లు
నూనె: 1 టీస్పూన్లు
గసగసాలు: 1 టీస్పూన్లు
కాలతప్పం స్వీట్ తయారు చేసే విధానం :
1. ముందుగా, బియ్యాన్ని బాగా కడిగి, కనీసం 2 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. బియ్యం నానిన తర్వాత, దానిని సన్నగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి.
2. బెల్లాన్ని చిన్న ముక్కలుగా కోసుకొని, ఒక కప్పు నీటిలో వేసి బాగా ఉడికించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం పానకాన్ని ఏ చెత్తా లేకుండా ఒక గిన్నెలో వడకట్టుకోవాలి.
3. బెల్లం పానకాన్ని నానిన బియ్యం పిండిలో కలపాలి. దీని తర్వాత కొబ్బరి తురుము, యాలాకుల పొడి కూడా ఈ మిశ్రమంలో కలపాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి వేడయిన తరువాత అందులో గసగసాలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4. వేడిగా ఉన్న నెయ్యిలో కలుపుకున్న బియ్యం, బెల్లం పానకాన్ని కూడా కలుపుకోవాలి. ప్యాన్పై మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. తయారు చేసుకున్న స్వీట్ పై చిన్న రంద్రాలు గనుక వస్తే అప్పుడు కాలాతప్పం రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని కాలతప్పాన్ని కిందకు దించేసుకోవాలి. కాల తప్పాన్ని ముక్కలుగా కోసి సర్వ్ చేసుకోవచ్చు.
మరిన్ని చిట్కాలు :
కాలతప్పం ని మరింత రుచిగా తయారు చేయడానికి కొబ్బరి పాలు కూడా ఉపయోగించవచ్చు. బెల్లం పానకాన్ని మీ రుచికి అనుగుణంగా సర్దుబాటు చేయవచ్చు. సర్వ్ చేసే సమయంలో కొబ్బరి తురుము లేదా డ్రై ఫ్రూట్స్ చల్లి మరింత రుచిగా తయారు చేయవచ్చు. కాలతప్పం ని పంచదార తో కూడా చేసుకోవచ్చు. కాలతప్పం ని చాక్లెట్ సాస్ తో కూడా సర్వ్ చేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












