Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పోషకాలు పుష్కలంగా వుండే మామిడికాయ పులుసు చేసుకుందామా..!
ఈ వేసవిలో మనం మామిడికాయతో సాధ్యమైనన్ని వంటకాలు చేసుకోవాలి. ఇంకా కొన్ని రోజులైతే మామిడికాయలు మనకు దొరకవు. మామిడికాయలో రుచి మాత్రమే కాదు పోషకాలు కూడా మెండుగా వుంటాయన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఈ సారి మామిడికాయ పులుసు రెసిపీని మీకోసం ప్రత్యేకంగా తీసుకొని వచ్చాము. దీన్ని చేయడానికి ఎక్కువ వంట వస్తువులు అవసరం లేదు ఎక్కువ సమయం కూడా తీసుకోదు. కొన్ని నిమిషాల్లోనే మామిడికాయ పులుసును రెడీ చేసుకోవచ్చు.
మామిడికాయ పులుసు చేయడానికి ఒక కుక్కర్‌ను తీసుకోవాలి. అందులో అరకప్పు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పును రెండు మూడు సార్లు బాగా కడగాలి. ఏ చెత్తా లేకుండా చూసుకొని ఇప్పుడు కడిగిన కందిపప్పులో ఒక కప్పు నీళ్లను పోయాలి. పప్పు బాగా ఉడికితేనే పులుసు బాగా అవుతుంది. ఉడకబెట్టే ముందు అరగంటపాటు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు కందిపప్పును బాయిల్ చేసే ముందు అందులో తగినంత పసుపుని, కొన్ని కరివేపాకులను, రెండు టీ స్పూన్ల ఆయిల్‌ను తీసుకొని బాగా కలపాలి. కుక్కర్ మూతను టైట్‌గా పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి.
మామిడికాయ పులుసు టేస్టీగా రావాలంటే పుల్లటి మామిడితోనే పులుసును చేయాలి. ఒక పుల్లటి మామిడికాయను తీసుకొని దాని తొక్కను తీసివేయాలి. తరువాత వాటిని పొడువుగా కట్ చేసుకోవాలి. కుక్కర్‌లో ఉడికిన పప్పును కిందకు దించేసి పప్పు గొట్టంతో పప్పును మెత్తగా రుబ్బాలి. దీంట్లో తగినంత ఉప్పు, కారం, కొన్ని టమాట ముక్కలను, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. పప్పులో చింతపండు వేయకపోతే ఏదో వెలితి ఉంటుంది. ఆ వెలితి పోవాలంటే రెండు టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని పిండుకోవాల్సిందే. చింతపండును వద్దనుకున్న వారు వేయకుండా కూడా చేసుకోవచ్చు. మామిడికాయ పులుసు పలుచగా వుంటేనే బాగుంటుంది. కాబట్టి మీకు కావలసినన్ని నీళ్లని యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ నీళ్లు కాకుండా రెండు కప్పుల వరకు తీసుకోవాలి.
ఇప్పుడు పలుచగా అయిన పప్పును 10 నిమిషాల వరకు స్టవ్‌పై పెట్టి మరిగించాలి. కోసుకున్న మామిడికాయ ముక్కలను పప్పులో వేసుకోవాలి. మామిడికాయ పులుసు టేస్టీగా రావడానికి ఒక టీ స్పూన్ సాంబార్ పొడిని వేసుకోవాలి. పప్పులో వున్న మామిడికాయ ముక్కలు బాగా ఉడికేంతవరకు పప్పును మరిగించాలి. పప్పును మరీ ఎక్కువగా కూడా మరిగించవద్దు.
పోప్‌ను రెడీ చేసుకోవడానికి చిన్న ప్యాన్‌ను తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆవాలు జిలకర, వెల్లుల్లి పేస్ట్‌ను యాడ్ చేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొన్ని ఎండి మిరపకాయలను, కరివేపాకులను, ఇంగువను వేసుకొని ప్రై చేసుకోవాలి. తరువాత దీన్ని ఉడుకుతున్న పప్పులో వేసుకొని 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇక దీంతో వేసవి స్పెషల్ మామిడి పులుసు రెడీ అయినట్టే.
మామిడికాయ ముక్కల్లో వైటమిన్ సి వుంటుంది. పప్పులో ప్రొటీన్లు వుంటాయ్. రెండింటినీ తీసుకుంటే ఇక పోషకాలు బాగా అందినట్టే కదా. కాబట్టి మామాడికాయ పులుసుతో రుచి మాత్రమే కాదు పోషకాలు కూడా బాగా అందుతాయ్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












