New year special cake: డిసెంబర్ 31 నైట్ కేకు కోయాల్సిందేనా..వైట్ పారెస్ట్ కేకుని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

Posted By:

మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలవనున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక్కో దేశంలో ఒక్కోలా జరుగుతుంటాయి. మనదేశంలో చాలామంది డిసెంబర్ 31 అర్థరాత్రి 11:59 దాటగానే కేకు కట్ చేసి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుంటారు. తర్వాత ఈ కేకు ముక్కలను తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే న్యూ ఇయర్ కేకు కోసం మీరు బేకరీకి వెళ్లి వందల రూపాయలు పెట్టి కొనక్కర్లేదు. న్యూ ఇయర్ పార్టీ కోసం బేకరీకి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా కేకుని తయారు చేసుకోవచ్చు. ఎక్కువమంది ఇష్టపడే వైట్ పారెస్ట్ కేకుని ఎలా తయారు చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.

న్యూ ఇయర్ స్పెషల్ వైట్ ఫారెస్ట్ కేకు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బటర్
-మైదా పిండి
-మిల్క్ పౌడర్
-బేకింగ్ సోడా
-బేకింగ్ పౌడర్
-వెనిగర్
-వెన్నిలా ఎసెన్స్
-షుగర్ పౌడర్
-కాచి చల్లార్చిన పాలు
-వెన్న
-విప్పింగ్ క్రీమ్ పౌడర్
-ఐస్ క్యూబ్స్
-షుగర్ సిరప్
-బటర్ పేపర్

వైట్ ఫారెస్ట్ కేకు తయారీ విధానం

-కేకు టిన్ను తీసుకొని దానిలో బటర్ లేదా ఆయిల్ ని అప్లై చేసి దానిపై కొద్దిగా మైదాపిండి చల్లుకోవచ్చు లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని వేసి దానిపై కూడా కొంచెం బటర్ అప్లై చేసి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు ఓ గిన్నె తీసుకొని దానిమీద జల్లెడ పెట్టి అందులో 1 కప్పు మైదాపిండి,పావు కప్పు మిల్క్ పౌడర్,అర టీ స్పూన్ బేకింగ్ సోడా,1 టీస్పూన్ బేకింగ్ పౌడర్,1 టీస్పూన్ వెనిగర్ వేసి వీటన్నింటిని బాగా జల్లించుకోండి. తర్వాత అన్నీ కలిసేటట్లు కలిపి గిన్నెను పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో పావు కప్పు కరిగించిన వెన్న,అర కప్పు షుగర్ పౌడర్,ముప్పావు కప్పు కాచి చల్లార్చిన పాలు,1 టీస్పూన్ వెన్నిలా ఎసెన్స్(Vanilla Essence)
కూడా వేసి మొత్తం బాగా కలిసేట్లు కలుపుకోండి.

-బౌల్ లోని షుగర్ పౌడర్ పూర్తిగా కరిగిపోయేంతవరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పోస్తూ బాగా కలిపిన తర్వాత ఈ మొత్తాన్ని బటర్ అప్లై చేసి పక్కన ఉంచిన కేకు టిన్నులో పోసేయండి.

-తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ పాన్ పెట్టి అందులో ఓ స్టాండ్ పెట్టి 10నిమిషాలు హీట్ చేసిన తర్వాత అందులో ఈ కేకు టిన్నుని పెట్టి మూతపెట్టేసి 30 నిమిషాల పాటు బేక్ చేయండి.

-30 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేయండి. ఓ టూత్ పిక్ తీసుకొని గుచ్చి చూడండి. టూత్ పిక్ కి ఏ మాత్రం పిండిలా అంటుకోకుంటే కేకు బాగా బేక్ అయినట్లేనని భావించవచ్చు. వెంటనే ఈ కేకు టిన్నుని బయటకు తీసి దానిమీద ఓ గుడ్డ కప్పి కేకుని పూర్తిగా చల్లారనివ్వండి.

-ఇప్పుడు వైట్ చాక్లెట్ ని తీసుకొని చాకుతో తురుముకోండి. ఈ వైట్ చాక్లెట్ బేకరీలు లేదా అమెజాన్ వంటి ఆన్ లైన్ సైట్లలో అందుబాటులో ఉంటుంది.

-తర్వాత వెడల్పుగా ఉన్న ఓ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్(whipping cream powder),అర కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి బాగా కలపి ఈ బౌల్ ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయండి.

-10 నిమిషాల తర్వాత వెడల్పుగా ఉన్న ఓ గిన్నె తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి వాటి మీద డీప్ ఫ్రిడ్జ్ లో నుంచి గిన్నె తీసి పెట్టి 3-4 నిమిషాలు కంటిన్యూగా బ్లండ్ చేయండి. క్రీము కాస్త గట్టిపడిన తర్వాత అందులో 2 టీస్పూన్ల షుగర్ పౌడర్ వేసి మళ్లీ 3-4 నిమిషాలు బాగా బ్లెండ్ చేస్తే కేకు క్రీమ్ రెడీ. దీన్ని అలాగే ఐస్ క్యూబ్స్ గిన్నెలోనే ఉంచి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు ఓ ప్లేట్ తీసుకొని దానిమీద కేసుని పెట్టి పైన ఉబ్బిన పార్ట్ మొత్తాన్ని చాకుతో కట్ చేయండి. తర్వాత ఒక లేయర్ గా లేదా రెండు లేయర్స్ గా కేకుని కట్ చేసుకోండి.

-తర్వాత కేకు పాడ్ తీసుకొని దాని మధ్యలో కొద్దిగా కేకు క్రీమ్ అప్లై చేసి దాని మీద ఒక లేయర్ కేకు పెట్టి దానిమీద షుగర్ సిరప్ వేసుకోండి. షుగర్ సిరప్ ని.. అరకప్పు వాటర్ లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ వేసి కలిపితే రెడీ అయిపోతుంది.

-కేకు లేయర్ మీద సిరప్ వేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ని అన్ని వైపులకి కలిసేటట్లుగా అప్లై చేశాక దానిమీద ముందుగా కట్ చేసి ఉంచిన చాక్లెట్ తురుము వేయండి. తర్వాత దానిమీద ఇంకో లేయర్ కేకు పెట్టి దానిమీద షుగర్ వేపి తర్వాత క్రీమ్ రాసి తర్వాత చాక్లెట్ తురుము కూడా వేయండి. దీని మీదనే మిగిలిన మరో లేయర్ కేకుని కూడా పెట్టి దానిమీద షుగర్ సిరప్ వేసిన తర్వాత క్రీముని కేకు మొత్తంలో ఎక్కడా ఖాళీ లేకుండా అప్లై చేసుకోండి.

-తర్వాత కేకు చుట్టూ కట్ చేసి ఉంచిన చాక్లెట్ తరుముని అద్దుకోండి.

-తర్వాత కేకు పై భాగంలో క్రీముతో మీకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకోండి. పైన కొన్ని చెర్రీలను కూడా డెకరేట్ చేసుకోండి. అంతే కేకు రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, December 29, 2024, 16:08 [IST]
Desktop Bottom Promotion