Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
కురుక్షేత్ర యుద్ధం: మహాభారతంలోని కీలక ఘట్టాలు, అర్జునుడు, కర్ణుడి కథలు వెల్లడి -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!
Dahipuri: నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినేది ఇదే, రుచి అమోఘంగా ఉంటుంది, ఎలా చేసుకోవాలంటే?
మన దేశంలో ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి. గల్లీకో పేరు ఉన్నట్లుగా.. వీధికొక వంట ఫేమస్‌గా ఉంటుంది. అవి కూడా చాలా రుచిగా తింటే నోట్లో కరిగిపోయే విధంగా ఉంటాయి. ఆ వంటలను చేసుకోవడం కూడా చాలా సులభం. ఇంట్లోనే వాటిని తయారుచేసుకోవచ్చు కూడా. అలాంటి వంటల్లో ఒకటే దహీపూరి. దీనిని ఉత్తర భారత దేశంలో ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు. పెరుగు, పూరీల కాంబినేషన్‌లో ఈ వంటకం ఉంటుంది. దీని రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఈ స్టోరీలో ఈ దహీపురి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
పూరీలు: 12-15
పెరుగు: 2 కప్పులు
ఉడికించిన బంగాళదుంపలు: 2
ఉడికించిన శనగలు: 1/2 కప్పు
ఉల్లిపాయలు: 1 చిన్నది
టమోటాలు: 1 చిన్నది
కొత్తిమీర: కొద్దిగా
చింతపండు చట్నీ: 2 టేబుల్ స్పూన్లు
పుదీనా చట్నీ: 2 టేబుల్ స్పూన్లు
కారం: 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్
చాట్ మసాలా: 1/2 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
సేవ్: గార్నిష్ కోసం
తయారీ విధానం:
ముందుగా, ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా చేసి, అందులో ఉడికించిన
శనగలు, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి,
చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
పెరుగును బాగా చిలికి, అందులో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
పూరీలను చిన్న రంధ్రాలు చేసి, అందులో బంగాళదుంప మిశ్రమాన్ని
నింపాలి.
పూరీలపై పెరుగు, చింతపండు చట్నీ, పుదీనా చట్నీ వేయాలి.
చివరగా, సేవ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
దహీపూరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రోబయోటిక్స్: పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి,
ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
కాల్షియం: పెరుగులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను
బలంగా ఉంచుతుంది.
ప్రోటీన్: బంగాళదుంపలు, శనగలలో ప్రోటీన్ ఉంటుంది,
ఇది కండరాలను బలంగా ఉంచుతుంది.
విటమిన్లు, ఖనిజాలు: ఉల్లిపాయలు, టమోటాలు,
కొత్తిమీరలో విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని
పెంచుతాయి.
ఫైబర్: శనగలలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని
నివారిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












