అందరూ ఇష్టపడే ఉల్లిపాయ సమోసా..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుంటే క్రిస్పీగా సూపర్ గా వస్తాయి..

Posted By:

సమోసా అంటే తెలియని భారతీయులు ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో దీనిని టేస్ట్ చేసే ఉండి ఉంటారు. అయితే చాలామంది దీనిని స్ట్రీట్ సైడ్ షాపుల్లోనే లేదా బేకరీల్లోనే కొనుక్కొనొ లేదా జర్నీల్లో ఉన్న సమయంలో ఎవరైనా అమ్ముతుంటే కొనుక్కొని తిని ఉంటారు. వాస్తవానికి ఆఫీసుల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు సాయంత్రం పూట స్నాక్ గా తీసుకునే ఐటమ్స్ లో ఉల్లిపాయ సమోసా టాప్ ప్లేస్ లో ఉంటుంది. సౌతిండియాలో ఆనియన్ సమోసా ఫేమస్ కాగా..నార్త్ ఇండియాలో ఆలూ సమోసా ఎక్కువగా తింటారు.

సౌతిండియాలో ఎక్కడైనా లభించే ఆనియర్ సమోసాని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. రోడ్డు పక్కన కొని తినే సమోసాలను మించిన టేస్ట్ ను కూడా పొందవచ్చు. ఇంట్లో అసలు ఈ ఆనియన్ సమోసా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఆనియన్ సమోసా తయారీకి కావలసిన పదార్థాలు
-మైదా పిండి
-నీరు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-చాట్ మసాలా
-కొత్తిమీర
-కారం
-ఉప్పు
-ఆయిల్

Mango Pakodi: నోరూరించే పచ్చిమామిడికాయ పకోడీ..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

ఆనియన్ సమోసా తయారీ విధానం

-ముందుగా ఓ బౌల్ లో రెండు కప్పుల మైదా పిండి వేసుకోండి.

-మైదాపిండిలో కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసి కలుపుకొని తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసి కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్న మిశ్రమం సెమీ సాఫ్ట్ గా ఉంటాలి.

-తర్వాత పిండిని చపాతీ కర్రతో పలుచగా రోల్ చేసుకోవాలి. చపాతీలా చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి చపాతీని వేసి లైట్ గా కాల్చి తీసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు మరో బౌల్ లో 2 స్పూన్ల మైదా పిండి, కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి.

-ఇప్పుడు చపాతీలను అన్నీ ఒకదానిమీద ఒకటి వేసుకొని అన్ని సైడ్స్ కట్ చేసి స్క్వేయర్ షేపులో కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని రెండు సమాన భాగాలుగా కట్ చేయాలి.

-ఇంతకుముందు చపాతీలను కట్ చేసినప్పుడు మిగిలిన ఎడ్జెస్ చపాతీ పీసులను ఆయిల్ లో క్రిస్పీగా వేయించి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు స్టఫింగ్ కోసం.. ఓ బౌల్ లో ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలిపి ఇందులో వేయించిన చపాతీ ఎడ్జెస్ కొన్ని వేసి కలుపుకోవాలి.

-తర్వాత స్వ్యేయర్ షేపుల కట్ చేసిన చపాతీని తీసుకొని దాన్ని సమోసా షేపులో చుట్టుకొని మధ్యలో అందులో స్టపింగ్ పెట్టుకొని ఆయిల్ లో వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకుంటే క్రిస్పీ సమోసా రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, April 21, 2025, 19:30 [IST]
Desktop Bottom Promotion