పచ్చికారం ఎగ్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? జిందగీలో ఇలాంటి టేస్ట్ చూసి ఉండరు,ఎలా చేయాలంటే

Posted By:

కోడిగుడ్లతో అనేక రకాల వంటలు చేస్తుంటారు. కోడిగుడ్ల కారం, కోడిగుడ్డు ఫ్రై, కోడిగుడ్డు పులుసు,ఎగ్ గ్రేవీ ఇలా అనేక రకాల వంటలు చేస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా పచ్చికారంతో చేసిన ఎగ్ కర్రీ తిన్నారా? తినకపోయి ఉంటే ఓ సారి ట్రై చేసి తీరాల్సిందే. వేడి వేడి అన్నంతో లేదా చపాతీ లేదా బగారా,పులావ్ వంటి దేనితో కలిపి తిన్నా దీని రుచి అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు ఇష్టపడే పచ్చికారం ఎగ్ కర్రీని ఇంట్లో చాలా ఈజీగా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

పచ్చికారం ఎగ్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు

గుడ్లు- 6
కారం-పావు టీస్పూన్
ఉప్పు-పావు టీస్పూన్
పసుపు-పావు టీస్పూన్
ఆయిల్- తగినంత
ఉల్లిపాయలు-2
వెల్లుల్లి-15 పొట్టు తీసినవి
జీడిపప్పు-గుప్పెడు
అల్లం-1 ఇంచు
పచ్చిమిర్చి- 10-12
మిరియాలు- 10
దాల్చిన చెక్క-చిన్న ముక్క
బిర్యానీ ఆకు-1
యాలకలు-2
లవంగ మొగ్గలు-4
జీలకర్ర-అర టీస్పూన్
ధనియాల పొడి- 1 టీస్పూన్
కొత్తిమీర-కొంచెం
కసూరీమెతి-కొంచెం

తయారీ విధానం

-ముందుగా 6 గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కనపెట్టుకోండి. కోడిగుడ్డుకి చిన్న గాటు పెట్టుకోండి
తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చెసి అందులో ఉడికించిన కోడిగుడ్లు వేసి ఇందులో కారం, పసుపు, ఉప్పు వేసి గుడ్లను బాగా ఫ్రై చేయండి.

-బాగా ఫ్రై అయిన గుడ్లను ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి

-ఇప్పుడు అదే పాన్ లో ఉల్లిపాయ చీలికలు,పచ్చిమిరపకాయల ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, జీడిపప్పు పలుకులు, అల్లం ముక్కలు వేసి కలుపుతూ బాగా ఫ్రై చేసి చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా కాడలతో సహా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చినచెక్క,యాలకలు,లవంగాలు వేసి దోరగా ఫ్రై చెయ్యాలి.

బంజారా చికెన్ కబాబ్ ఎప్పుడైనా తిన్నారా? చూస్తేనే నోట్లో నీళ్లూరిపోతున్నాయా, ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి

-తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసి ఉంచిన పేస్ట్ ను వేసి బాగా కలపండి. ఆయిల్ సపరేట్ అయ్యేవరకు కలుపుతూ ఉడికించాలి.

-తర్వాత అందులో రుచికి తగినట్లుగా ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

-తర్వాత అందులో అరకప్పు పెరుగు వేసి కలిపి గ్రేవీకి సరిపడా నీళ్లను ఇందులో పోయాలి.

-రెండు నిమిషాల తర్వాత అందులో ఉడకబెట్టి ఫ్రై చేసిన గుడ్లను వేసి మసాలా వాటికి పట్టేలా కలిపి మూతపెట్టి 3 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి.

-ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర, కసూరీ మెతీ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే పచ్చికారం ఎగ్ కర్రీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, March 6, 2025, 8:34 [IST]
Desktop Bottom Promotion