Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేడి వేడి అన్నంలోకి పెసరపప్పు బంగాళదుంప కర్రీ, ఊరగాయతో నోరూరాల్సిందే
పప్పు పేరు వింటే చాలు చాలా మందికి ఇష్టం. అటువంటి పప్పులో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్లు మరియు ఇతర పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. అలాంటి పప్పులలో పెసరపప్పు ఒకటి, ఈ పప్పుతో ఈ రోజు ఒక సులభమైన వంటకాన్ని మీతో పంచుకుంటున్నాం. ఇది తయారు చేయడానికి కేవలం 20 నిమిషాలు పడుతుంది. ఈ రుచికరమైన దాల్ కర్రీని బంగాళదుంపతో తయారు చేస్తే మరింత పోషకమైనదిగా, రుచికరమైనదిగా మారుతుంది.
పెసరపప్పులో ఆరోగ్యాకినికి సంబంధించి ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, అలాగే మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ సూచికను కలిగి ఉంటుంది, అంటే చక్కెర క్రమంగా రక్తప్రవాహంలోకి విడుదల అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది సరిపోతుంది. అలాంటి పెసరపప్పును మన రెగ్యులర్ డైట్ చేర్చుకోవాల్సిందే.
ఇందులో ఉపయోగించే మసాలాలు మీ మధ్యాహ్న భోజనాన్ని మరింత రుచికరంగా మారుస్తాయి. ఇది కాకుండా, వైట్ రైస్‌కు పప్పు బెస్ట్ కాంబినేషన్ గా చాలా మంది ఇష్టపడతారు, ఇది సరైన కలయిక. వేడి అన్నం, వేడి వేడి పెసరపప్పు ఆలుగడ్డ పప్పు, ఒక చెంచా నెయ్యి మరియు ప్లేట్ లో ఓ మూలన మామిడి ఊరగాయతో పాటు తింటే ఓ అద్భుతమైన రుచిని మీకు అందిస్తుంది. ఈ కాంబినేషన్ ప్లేట్ లో చూడగానికి మీ నోట్లో నీళ్ళూ ఊరాల్సిందే. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.

ముగ్గురికి వడ్డించవచ్చు
*తయారీ సమయం: 15 నిమిషాలు
*వంట సమయం: 18 నిమిషాలు
కావాల్సినపదార్థాలు
*పెసరపప్పు- 1 కప్పు (పచ్చివి)
* బంగాళదుంపలు - 2 (ఉడికించినవి)
*టమోటో - 3 (తరిగినవి)
* పచ్చిమిర్చి - 5 (తరిగినవి)
* అల్లం - 1 ముక్క (చిన్న ముక్కలు)
*కరివేపాకు - కొద్దిగా
*కొత్తిమీర - కొద్దిగా
* రుచికి సరిపడా ఉప్పు
*నీరు - 1 కప్పు
పోపుకు
*ఆవాలు - 1 స్పూన్
* జీలకర్ర - 1 స్పూన్
*పసుపు - 1/2 స్పూన్
*నూనె/నెయ్యి - 1/2 tsp
తయారీ విధానం
*ఒక పెద్ద బాణలిలో నూనె వేసి, ఈ నూనె కాగే వరకు ఉంచి, తరువాత నెయ్యిలో
పోపుకు దినుసులను జోడించండి. 2-3 నిమిషాలు వేగనివ్వండి.
*ఇప్పుడు ఈ పాన్‌లో తరిగిన టొమాటో, తరిగిన పచ్చిమిర్చి,
అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి మీడియం మంట మీద వేడి
చేయాలి.
* ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలు మరియు ఉడికించిన పెసెళ్లు
పాన్‌లో వేసి 10 నిమిషాలు ఉడికించాలి.
*తర్వాత కొంచెం నీళ్ళు కలపండి, ఎప్పుడైతే కూర చిక్కగా మారిందని మీకు
అనిపిస్తే అప్పుడు స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయండి.
పోషకాహార సలహా
పెసరపప్పు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి, మధుమేహానికి మంచిది
మరియు గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఐరన్ కంటెంట్ ను అందిస్తుంది.
సలహా
వంట చేసేటప్పుడు ఎక్కువ నీరు కలపకుండా జాగ్రత్త వహించండి. పెసళ్ళు
మరియు బంగాళాదుంప వంటకం కొంచెం కష్టం, అయినా ఇది రుచిమాత్రం అద్భుతంగా
ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications