Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
Central Bank Gold Buying Crashes 80% in January, Falls to Just 5 Tonnes WGC -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
మన పూర్వీకుల ఎనర్జీ డ్రింక్ రాగి అంబలి.. హర్లిక్స్, బూస్ట్ కంటే ఎక్కువ పోషకాలు..!
అంబలి అంటే ఇప్పుడు అదేదో పూర్వ కాలంలో తినే ఆహారంలో ఇప్పటి జనరేషన్ చూస్తారు. కానీ అంబలిలో హార్లిక్స్, బోర్న్‌వీటా కంటే బలమైన పోషకాలు వున్నాయన్ని విషయాన్ని వారికి తెలియజేయాలి. ఇప్పుడు పిల్లలు ఉదయం పూట హార్లిక్స్, కాంప్లాన్, బూస్ట్ లాంటి ఎనర్జీ డ్రింక్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తాగుతారు. పూర్వకాలంలో ఇలాంటి ఎనర్జీ డ్రింకే అంబలి. ఇప్పుడు కూడా చాలా మంది క్రమం తప్పకుండా అంబలిని తాగుతారు. బయట చిన్న టెంట్ వేసుకొని అంబలిని చేసి అమ్మేవారు చాలా మందే వున్నారు. ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టైనా రోడ్డు మీద అంబలి కనబడగానే తీసుకొని తాగుతారు. ఈ రోజు ఈ అంబలిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ పూర్వ కాలపు ఎనర్జీ డ్రింక్‌ను మనము మళ్లీ ఉదయంపూట చేసుకొని తాగుదాము.
రాగి అంబలిని తయారు చేయడానికి కావలసిన వంట సామాగ్రి
రాగి పిండి, పెరుగు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు
రాగి అంబలి తయారు చేసే విధానం
ముందుగా ఒక బౌల్‌లోకి రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకోవాలి. ఇందులో అరకప్పు నీళ్లను తీసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న రాగి పిండిని 10 గంటల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అంబలి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఈ బౌల్‌లో రాగిపిండి నీళ్లు పైకి తేలుతాయ్. ఈ నీళ్లని మళ్లి వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ నీళ్లతో చేసిన అంబలి చాలా టేస్టీగా వస్తుంది.
ఒక ప్యాన్‌తీసుకొని అందులో రెండు నుంచి 3 కప్పుల నీళ్లను పోసుకోవాలి. మరుగుతున్న నీళ్లల్లో నానబెట్టిన రాగిపిండిని తీసుకోవాలి. వెంటనే ఈ రాగిపిండిని, నీళ్లను బాగా కలపాలి. రెండు టీ స్పూన్ల ఉప్మ రవ్వను యాడ్ చేసుకోవాలి. 4 నుంచి 5 నిమిశాలు ఈ అంబలిని బాగా ఉడకబెట్టాలి.
రాగి అంబలి చిక్కగా కావాలంటే మరింత ఉడకబెట్టుకోవచ్చు. కానీ మరీ ఎక్కువగా ఉడకబెడితే తాగడానికి వీలు వుండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఉడకబెట్టాలి.
ఒక అరకప్పు పెరుగును ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. స్పూన్‌తో పెరుగును బాగా స్మాష్ చేయాలి. ఇందులోనే అరకప్పు నీళ్లను తీసుకొని మజ్జిగలా కలుపుకోవాలి. ఈ మజ్జిగను రాగిజావలో కలుపుకోవాలి. కొన్ని నీళ్లు కావాలనిపిస్తే తగినంత యాడ్ చేసుకోవచ్చు.
టేస్ట్‌కోసం తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇక దీంతో రాగి అంబలి రెడీ అయినట్టే. తయారైన అంబలిని గ్లాసులోకి పోసుకోవాలి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి, పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా విరిచి అంబలి గ్లాసులో వేసుకొవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని నంచుకొని రాగి అంబలిని తాగితే రుచి మాత్రమే కాదు శరీరానికి ప్రొటీన్లు, క్యాల్షియం సంమృద్ధిగా అందుతాయ్.
రాగి అంబలిలో పోషకాలు
రాగి అంబలిలో పోషకాలు మెండుగా వుంటాయ్. కేవలం 100 గ్రాముల రాగి పిండిలో 7 గ్రాములకు పైగా ప్రొటీన్లు వుంటాయ్. 72 గ్రాముల కార్బోహైడ్రేట్ వుంటుంది. ఫైబర్ 19 గ్రాముల వరకు వుంటుంది. ఇక క్యాల్షియం 344 మిల్లీ గ్రాములుంటుంది. ఐరన్, 3.9 మిల్లీ గ్రాములుంటుంది, మెగ్నీషియం 137 మిల్లీ గ్రాములుంటుంది, పొటాషియం 408 మిల్లీ గ్రాములుంటుంది, సోడియం 11 మిల్లీ గ్రాములుంటుంది, ఫాస్ఫరస్ 283 మిల్లీ గ్రాములుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













