Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్.. అచ్చం అదే టేస్ట్‌లో ఇలా చేసుకోండి,మూతి నాకేస్తారు అంతే!
రాజమండ్రి అంటేనే అందరికీ గుర్తొచ్చేది రోజ్ మిల్క్. రాజమండ్రి వెళ్లిన ప్రతి ఒక్కరు రోజ్ మిల్క్ టేస్ట్ చేసి మరీ వెళ్తారు. అంత అద్భుతమైన రుచితో ఇది ఉంటుంది మరి. కేవలం రాజమండ్రిలోనే కాదు యావత్ భారత దేశంలో ఈ రోజ్ మిల్క్ ఇష్టపడని వారంటూ ఉండరు. అచ్చం రాజమండ్రి రోజ్ మిల్క్ టేస్ట్ వచ్చేలా.. ఈ రోజ్ మిల్క్ తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అయితే సరైన పద్దతిలో దానిని చేసుకోవడం అనేది ముఖ్యం. ఈ రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రోజ్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
కాచి చల్లార్చిన పాలు
పచ్చి కోవా
రోజ్ సిరప్
యాలకుల పొడి
కుంకుమపువ్వు
ఐస్ క్యూబ్స్
చక్కెర (రుచికి తగినంత)
రోజ్ మిల్క్ తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో కాచి చల్లార్చిన పాలను తీసుకుని, అందులో కావలసినంత రోజ్ సిరప్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఆ పాలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో కొద్దిగా పాలు తీసుకొని వేడి చేయాలి.
అందులో పచ్చి కోవాను చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఆ కోవా పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కోవా మొత్తం కరిగిన తరువాత అందులో చెక్కర వేసుకొని బాగా కలపాలి. కోవా, పాలు రెండూ దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి.
చివరగా యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసుకొని దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. ఆ తరువాత ఒక గ్లాస్‌లో ఐస్ క్యూబ్స్ వేసుకొని, అందులో తయారు చేసిన కోవా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తరువాత దానిపై రోజ్ మిల్క్ బేస్‌ను పోసుకొని బాగా కలుపుకుంటే.. రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ రెడీ అయినట్లే. ఇలాగే చేసుకుంటే మీకు కూడా కచ్చితంగా రాజమండ్రి టేస్ట్ వచ్చేలా రోజ్ మిల్క్ వచ్చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












