Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
అడాయ్ని ఈ స్టైల్లో ఎప్పుడైనా చేసుకున్నారా..? బియ్యం పిండితో క్రీస్పీ, స్పాంజీ రెసిపీ..!!
బియ్యం పిండితో చేసే అడాయ్ను బ్రేక్ ఫాస్ట్ గా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం స్నాక్‌గా అయినా రెడీ చేసుకోవచ్చు. క్రిస్పీగా, స్పైసీగా, స్పాంజీగా చాలా బాగుంటాయ్. ఎన్ని తిన్నా కూడా కడుపు నిండుగా అనిపించదు. దోశలు అంటే బోర్ అనుకునేవాళ్లు ఈ అడాయ్ రెసిపీని చేసుకోవచ్చు. ఈ అడాయ్ను ఎలా రెడీ చేస్తారో తెలుసుకుందాం.
బియ్యంపిండితో చేసే అడాయ్ కోసం కావాల్సిన వంట పదార్ధాలు ఇవే :
అర అంగులం అల్లం ముక్క
3 వెల్లుల్లిపాయలు
2 పచ్చిమిరపకాయలు
1 కప్పు బియ్యం పిండి
అరకప్పుపెరుగు
అర టీస్పూన్ జిలకర
అరకప్పు క్యారెట్ తురుము
అరకప్పు క్యాబేజ్
అరకప్పు టమాటా ముక్కలు
ఒక క్యాప్సికం
అర టీస్పూన్ కారంపొడి
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు
అర టీస్పూన్ బేకింగ్ సోడా
2 స్పూన్ల మంచి నూనె
నువ్వులు
క్రిస్పీ అడాయ్ను ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి.
1. చిన్న మిక్సీ జార్లో అర అంగులం అల్లం ముక్కను, 3 వెల్లుల్లిపాయలను, 2 పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా దంచాలి. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులో అరకప్పుపెరుగును వేసుకోవాలి. దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అవసరానికి సరిపడ నీళ్లను పోసుకోవాలి.
2. దోశలు వేసుకునే విధంగా పిండిలో నీళ్లు పోసుకొని కలపాలి. మనం కలుపుకున్న పిండికి 1 కప్పు నీళ్ల వరకు సరిపోతుంది. ఇంతకు ముందు దంచిన పచ్చిమిర్చి పేస్టును బౌల్లో వేసుకోవాలి. అర టీస్పూన్ జిలకరను, అరకప్పు క్యారెట్ తురుమును వేసుకోవాలి. అరకప్పు క్యాబేజ్‌ను వసుకోవాలి. అరకప్పు టమాటా ముక్కలను, సన్నగా తరిగిన ఒక క్యాప్సికంను ముక్కలుగా కోసి వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, అర టీస్పూన్ కారంపొడిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులను వేసుకోవాలి.
3. బౌల్లో ఉన్న మొత్నాన్నీ బాగా కలిసి పదినిమిశాలు అలాగే పెట్టి మూత పెట్టాలి. ఇందులో అర టీస్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. ఇప్పుడు పెనంను స్టవ్ పైన పెట్టుకొని 2 స్పూన్ల మంచి నూనెను వేసుకోవాలి. పెనంపై రెండు చిటికెల నువ్వులను వేసుకొని రెండు గరిటెల పిండిని వేసుకోవాలి. ప్యాన్ పైన మూతపెట్టి రెండు నిమిశాల మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వదిలేయాలి.
4. ఒక సైడు కాలిన తరువాత మళ్లీ రెండో వైపు కూడా పెనంపై కాల్చాలి. ఇలాగే రెండు నిమిశాలు మూతపెట్టి కాల్చడం వల్ల అడాయ్ రెడీ అవుతుంది. ఇదే విధంగా కలుపుకున్న పిండి మొత్తం చేసుకోవాలి. దీంతో అడాయ్ రెడీ అయినట్టే.
5. ఈ అడాయ్ను టమాట సాస్ లేదంటే కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












