Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సాబుదానా వడ.. క్రిస్పీతో పాటు హెల్తీ కూడా.. ఒకసారి ట్రై చేయండి..!
సగ్గు బియ్యం వడలను ఎప్పుడైనా చేసుకొని తిన్నారా ? ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా వుంటాయ్. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటాయ్. వీటిని ఉదయం టిఫిన్‌కు లేదంటే సాయంత్రం స్నాక్స్ కోసం కూడా చేసుకోవచ్చు. సగ్గు బియ్యం వడలను చేసుకోవడానికి ఎక్కువ వంట పదార్ధాలు కూడా అవసరం లేదు. ఇంట్లో వున్న వాటితోనే చేసుకోవచ్చు. మార్కెట్లో ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం కూడా ఏమీ వుండదు.
సగ్గుబియ్యం వడలు తయారు చేసుకోవాలని ఈ కింది పదార్ధాలను రెడీ మీ ముందు వుంచుకోండి
1 కప్పు సగ్గుబియ్యం
గ్రీన్ చట్నీ
రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు
ఒక టేబుల్ స్పూన్ పూదీన ఆకులు
2 వెల్లుల్లిపాయలు
2 పచ్చిమిరపకాయలు
కొంచెం జీలకర్ర
రుచిక సరిపడ ఉప్పు
3 టేబుల్ స్పూన్ల పెరుగు
అరకప్పు పల్లీలు
ఒక చిన్న అల్లం ముక్క
1 మీడియం సైజు ఆలుగడ్డ
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,
కారంపొడి, జిలుకర పొడి, కొత్తిమీర ఆకులు, ఫ్రై చేసిన పల్లీలు
మంచి నూనె
సగ్గుబియ్యం వడలను ఈ కింది విధంగా సింపుల్‌గా తయారు చేసుకోండి
1. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. లావు సగ్గుబియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వీటితోనే మనకు టేస్ట్ బాగా వస్తుంది. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో సగ్గు బియ్యంలో నీళ్లో పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని రాత్రి మొత్తం నానబెట్టాలి.
2. మీరు సాయంత్ర చేయాలనుకుంటే 4 గంటలు నానబెట్టినా సరిపోతుంది. సగ్గుబియ్యం వడ కోసం గ్రీన్ చట్నీ కావాలి. గ్రీన్ చట్నీ కోసం రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులను గ్రైండర్‌లో వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పూదీన ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. 2 వెల్లుల్లి పాయల్ని, 2 పచ్చిమిరపకాయల్ని, కొంచెం జిలకర, రుచిక సరిపడ ఉప్పును, 3 టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకొని నీళ్లేవీ లేకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక దీంతో గ్రీన్ చట్నీ రెడీ అయినట్టే.
3. ఇప్పుడ స్టవ్‌పై ప్యాన్ పెట్టి అరకప్పు పల్లీలను ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ గ్రైండర్‌లో ఒక చిన్న అల్లం ముక్కను, 2 పచ్చిమిరపకాయ ముక్కలను, కొన్ని కరివేపాకులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఫ్రై చేసిన పల్లీలను వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని సగ్గుబియ్యంలోకి తీసుకోవాలి.
4. ఒక మీడియం సైజు ఆలుగడ్డను తీసుకొని దానిపైన వున్న పొట్టు తీసి ఆ ఆలుగడ్డను మొత్తం సగ్గుబియ్యంలో తురమాలి. బౌల్‌లో రుచికి సరిపడ ఉప్పును, అర టీస్పూన్ కారంపొడి, అర టీస్పూన్ జిలకర పొడిని, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులను, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
5. నీళ్లు కలపకపోయినా మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. కలిపిన వెంటనే వడలు వేసుకోవాలి. ఇప్పుడ ఖడాయిలో వడలు వేసుకోవడానికి కావాల్సినంత మంచి నూనెను యాడ్ చేసుకోవాలి. చిన్న ఉండ తీసుకొని మెత్తగా ప్రెస్ చేసి వడలుగా చేసుకొని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.
6. వడలకు మధ్యలో రంద్రం చేసుకొని కూడా వేసుకోవచ్చు. వడలు మాడిపోకుండా చూసుకోవాలి. వడలు మరీ సన్నగా మరీ లావుగా చేసుకోకుండా మీడియం సైజులో చేసుకోవాలి. ఆయిల్‌లో వేసుకున్నప్పుడు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా జాగ్రత్తపడాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి.
7. మంచి క్రిస్పీగా, బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వడలను ఇలాగే తినేయవచ్చు లేదంటే గ్రీన్ చట్నీతో అయినా తినేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













