సేమియా ఊతప్పం.. చిటికెలో రెడీ.. ఇలా చేస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తాయ్..!

Posted By:

దోశతో బోర్ కొట్టిందా. ఈ సారి దోశలు వెరైటీగా చేసుకుందాం. సేమియాతో సేమియా ఊతప్పం చేసుకుంటే చాలా రుచిగా వుంటాయ్. పెరుగు, పచ్చిమిరపకాయలు, బొంబాయ్ రవ్వతో కలిపి చేసుకున్న ఈ ఊతప్పం చాలా బాగుంటుంది. చాలా తక్కువ మంది ఈ వంటకాన్ని చేసుకుంటారు. సేమియా ఊతప్పం కోసం ఎక్కువ వంట పదార్ధాలు కూడా అవసరం లేదు. ఇంట్లో వున్న వాటితోనే సేమియా ఊతప్పాన్ని చేసుకోవచ్చు. మరి సేమియా ఊతప్పం ఎలా రెడీ చేస్తారో తెలుసుకుందాం.

సేమియా ఊతప్పం చేసుకోవడానికి కావాల్సిన వంట పదార్ధాలు ఇవే :

మూడు పచ్చిమిరకపాయలను, చిన్న అల్లం ముక్క
ఒక కప్పు పెరుగు
అర టీస్పూన్ వంటసోడా
ఒక కప్పు బొంబాయ్ రవ్వ
ఒక కప్పు సేమియా
రుచికి సరిపడ ఉప్పు
మంచి నూనె
ఒక మీడియం సైజు ఉల్లిపాయ
అర టీస్పూన్ జిలుకర
కొన్ని కరివేపాకులు
కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి

సేమియా ఊతప్పాన్ని ఈ కింది స్టైల్‌లో రెడీ చేసుకోవాలి.

1. ముందుగా మూడు పచ్చిమిరకపాయలను, చిన్న అల్లం ముక్కలను దంచుకొని పక్కకు పెట్టాకోవాలి. వీటిని మిక్సీలో వేయకుండా రోకలితోనే దంచుకుంటే టేస్టుబాగా వస్తుంది.

2. మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. ఇందులో అర టీస్పూన్ వంటసోడా వేసి బాగా కలిపి అలాగే కొన్ని నిమిశాల వరకు వదిలేయాలి. ఒక కప్పు బొంబాయ్ రవ్వ, ఒక కప్పు సేమియా, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక కప్పు వేడినీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.

3. ఇందులో దంచుకున్న అల్లం పేస్టును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ముప్పై నిమిశాల వరకు అలాగే వదిలివేయాలి. 30 నిమిశాల తరువాత రవ్వ ఊరి, కలుపుకున్న మొత్తం పొంగుత్తుంది.

4. తరువాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మంచి నూనెను పోసుకొని వేడి చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అర టీస్పూన్ జిలుకర, కొన్ని కరివేపాకులను వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ కొంచె వేగే వరకు, పచ్చి వాసన పోయే వరకు కలుపుతూనే వుండాలి.

5. ఇప్పుడు ఊతప్పం వేసుకొవడానికి దోశలు వేసే పెనం స్టవ్‌పైన పెట్టి 1 టీస్పూన్ నూనె పోసి బాగా రాయాలి. ఒక గరిటె పిండిని పెనంపైన వేసి నెమ్మదిగా జాగ్రత్తగా ఊతప్పం వేసుకోవాలి, గంటతో తిప్పుకోవాలి. వేసిన ఊతప్పం మందంగా వచ్చేలా చూసుకోవాలి. ఊతప్పం చుట్టూ కొంచెం నూనెను పోసుకోవాలి.

6. ఈ ఊతప్పాలను మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చాలి. అలా కాల్చినప్పుడు మాత్రమే లోపల పిండి కూడా ఉడికి, ఊతప్పం టేస్టీగా అవుతుంది. మాడిపోకుండా, అటు, ఇటూ ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట క్రిస్పీగా లోపల మెత్తగా రుచిగా అవుతాయ్.

7. మనం కలుపకున్న పిండితో 6 నుంచి 7 ఊతప్పాలను చేసుకోవచ్చు. దీన్ని కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి, లేదంటే పెరుగుతో నంచుకొని సర్వ్ చేసుకోవచ్చు.

[ of 5 - Users]
Story first published: Thursday, July 18, 2024, 15:30 [IST]
Desktop Bottom Promotion