Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Sorakaya Halwa: సొరకాయ హల్వా..సింపుల్ గా ఇలా చేసుకుంటే పిచ్చెక్కించే టేస్ట్
హల్వా అనే పేరు వింటేనే చాలామందికి నోట్లో లాలాజలం ఊరిపోతుంది. అందులోనూ టేస్టీ హల్వాను వెతికి వెతికి మరీ కొనుక్కుని తినేటోళ్లు చాలామందే ఉంటారు. అయితే హల్వాలో సొరకాయ హల్వాది ప్రత్యేకమైన స్థానం. వెడ్డింగ్స్ లో ఎక్కువగా ఈ హల్వాని పెడుతుంటారు. ఈ సొరకాయ హల్వాని ఇంట్లోనే చేసుకునోవాలంటే దీని తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సొరకాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
-సొరకాయ
-చక్కెర
-పాలు
-యాలకులు
-బాదంపప్పు
-జీడిపప్పు
-ఎండుద్రాక్ష
-నెయ్యి
సొరకాయ హల్వా తయారీ విధానం
-లేత సొరకాయ తీసుకొని దాని చెక్కు తీసేసి సొరకాయ లోపలి గింజలు,దూది లాంటి భాగాన్ని తీసేయండి.
-ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలను బాగా తరుముకోవాలి. ఆ తరుమును బాగా పిండి నీటి శాతం ఏమీ లేకుండా చూసుకోవాలి.
-తర్వాత కొన్ని బాదంపప్పు ముక్కలుగా కట్ చేయండి, కొన్ని జీడిపప్పు, కొంచెం ఎండు ద్రాక్ష తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో చిక్కని పాలు పోసి హై ప్లేమ్ మీద కలుపుతూ మరిగించండి. పాలు బాగా మరగి లీటరన్నర పాటు 350 ఎమ్ఎల్ అయ్యేంతవరకు మరిగించాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి పోసి అందులో ముందుగా పక్కనపెట్టి ఉంచిన డ్రై ఫ్రూట్స్ వేసి వేపుకోండి. వేగిన తర్వాత వాటిని ఓ ప్లేట్ లో పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో మిగిలి ఉన్న నెయ్యిలోనే నీరు పిండుకున్న సొరకాయ తరుము వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోండి.
-సొరకాయ తురుములోని నీరు అంతా ఇగిరిపోయిన తర్వాత అందులో చక్కెర వేసి కలిపితే సొరకాయలోని మిగిలిన నీరుతో పంచదార కరుగుతుంది. కొంచెం జిగురుపాకం వచ్చేలా మీడియం ప్లేమ్ మీద కొద్దిసేపు ఉడికించండి.
-ఇఫ్పుడు మీగడతో ఉన్న రబిడీ మాదిరి పాలు బాగా మరిగితే స్టవ్ ఆపేసి సొరకాయ జిగురుపాకంలో ఈ పాలు పోసేయండి. ఇందులోనే నాలుగు ధంచిన యాలకుల పొడి కూడా వేసి కలపి 10 నిమిషాలు ఉడికిస్తే కోవాలా తయారవుతుంది.
-ఇప్పుడు ఇందులో నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్,కొంచెం నెయ్యి కూడా వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి టేస్టీ సొరకాయ హల్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












