Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మిల్ మేకర్లతో సోయా పులావ్.. వెజిటేరియన్లకు తింటే పండగే..!!
మిల్ మేకర్ బిర్యానీ లేదంటే సోయా పులావ్‌ను ఎప్పుడైనా చేసుకున్నారా. వీకెండ్లో ఏదైనా వెరైటీ కావాలనుకుంటే మిల్ మేకర్లతో ఈ సోయా పులావ్ చేసుకోవచ్చు. మిల్ మేకర్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయ్. మాంసంలో ఎన్ని పోషకాలు ఉంటాయో, సోయాలో కూడా అన్ని పోషకాలు ఉంటాయ్. సోయా పులావ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచింది. మరి సోయా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మిల్ మేకర్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట సామాగ్రి :
1 కప్పు మిల్ మేకర్లు
ఉప్పు
2 కప్పుల బాస్మతీ బియ్యం
1టేబుల్ స్పూన్ నెయ్యి
మంచి నూనె
రెండు బిర్యానీ ఆకులు
దాల్చిన చెక్క
ఆవాలు
మిరియాలు
ఒక టీ స్పూన్ సాజీర
అరకప్పు ఉల్లిపాయలు
4 పచ్చిమిరపకాయ ముక్కలు
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
ఒక మీడియం సైజు కట్ చేసిన ఆలుగడ్డ
పావు కప్పు క్యారెట్
అరకప్పు టమాట
పావు టీ స్పూన్ పసుపు
2 టీస్పూన్ల కారంపొడి
ఒక టీస్పూన్ ధనియాల పొడి
1 టీస్పూన్ గరం మసాలా
అరకప్పు పెరుగు
సన్నగా తరిగిన కొత్తిమీర
మిల్ మేకర్ బిర్యానీని ఈ కింది విధంగా రెడీ చేసుకోవాలి :
1. ముందుగా ఒక బౌల్ లోకి 1 కప్పు మిల్ మేకర్లను తీసుకోవాలి. ఇందులో వేడి నీళ్లు పోసి పది నిమిశాలు నానబెట్టాలి. కొంచెం ఉప్పు వేసి నానబెట్టాలి. పదినిమిశాల తరువాత మిల్ మేయర్లు మెత్తగా అవడం మనం చూస్తాం. మిల్ మేకర్ల నుంచి నీళ్లను మొత్తం పిండివేయాలి.
2. ఇప్పుడు 2 కప్పుల బాస్మతీ బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యాన్ని రెండు సార్లు బాగా కడగాలి. నీళ్లు పోసి 15 నుంచి 20 నిమిశాలు నానబెట్టాలి. ప్యాన్‌లోకి 1టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మరో రెండు టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోవాలి. ఇందులో రెండు బిర్యానీ ఆకులను, దాల్చిన చెక్క, ఆవాలూ , మిరియాలను వేసుకోవాలి. ఒక టీ స్పూన్ సాజీర వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అరకప్పు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
3. 4 పచ్చిమిరపకాయ ముక్కలను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నీళ్లను పిండివేసిన మిల్ మేకర్లను యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు కట్ చేసిన ఆలుగడ్డను కూడా వేసుకోవాలి. పావు కప్పు క్యారెట్‌ను అరకప్పు టమాటను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపును, 2 టీస్పూన్ల కారంపొడిని వేసుకోవాలి. ఒక టీస్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. 1 టీస్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి.
4. ఇందులోనే అరకప్పు పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులను వేసుకోవాలి. మూత పెట్టి, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిశాల వరకు ఉడికించాలి. ఐదు నిమిశాల తరువాత మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నానబెట్టిన రైస్‌ను తీసుకోవాలి. ఇప్పుడు రైస్‌ను స్లోగా కలుపుకోవాలి.
5. ఏ కప్పుతో అయితే నీళ్లను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పైన పావు కప్పు నీళ్లను పోసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒక సారి టేస్ట్ చూడాలి. ఐదు నిమిశాల తరువాత అన్నం చక్కగా ఉడుకుతుంది. మ్యాజిక్ మసాలా పొడిని ఈ రైస్‌లో కొద్దిగా వేసుకోవాలి. కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆరు నిమిశాల తరువాత అన్నం చక్కగా దమ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఉడకకపోతే మరో ఐదు నిమిశాలు పెట్టి ఉడికించండి.
6. ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా బిర్యానీని సర్వ్ చేసుకోవడమే. పెరుగతో నంచుకొని బిర్యానీ తింటే చాలా బాగుంటుంది. మిర్చి కా సలాన్ కర్రీ వేసుకున్నా అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












