Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
రెగులర్ దోశ బోర కొట్టిందా..? ఈ స్పాంజ్ దోశను ట్రై చేద్దాం..!
రెగులర్ దోశలు కాకుండా స్పాంజ్ దోశలు కొంత రుచికరంగా, తినడానికి మెత్తగా వుంటాయ్. ఆయిల్ ఎక్కువ లేకుండా స్పాంజ్ దోశలను సింపుల్‌గా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. స్పాంజ్ దోశ, కొబ్బరి చట్నీ రెసిపీని మీకోసం అందిస్తున్నాం.
స్పాంజ్ దోశ్ తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్ధాలు
1కప్పు బొంబాయ్ రవ్వ
అర కప్పు పుల్లటి పెరుగు
1 టీ స్పూన్ చెక్కర
అర కప్పు పల్లీలు
అరకప్పు పచ్చికొబ్బర
5 వెల్లుల్లిపాయలు
అర టీ స్పూన్ జిలుకర
4 పచ్చిమిరపకాయలు
ఒక నిమ్మకాయంత చింతపండు
ఉప్పు
మంచినూనె
1 టీ స్పూన్ మినపప్పు
1 టీ స్పూన్ ఆవాలు
4 ఎండిమిరపకాయలు
కొన్ని కరివేపాకులు
1 టీ స్పూన్ ఇనో పౌడర్
స్పాంజ్ దోశ తయారు చేసే విధానం
1. ప్యాన్‌లో 1కప్పు బొంబాయ్ రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఎక్కువ మాడిపోకుండా చూడాలి.
2. ఈ రవ్వను మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి, అర కప్పు పుల్లటి పెరుగును
కూడా వేసుకోవాలి.
3. 1 కప్పు నీళ్లను పోసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
4. సాఫ్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి.
5. 1 టీ స్పూన్ చెక్కరను కూడా బౌల్లో వేసుకోవాలి.
6. చట్నీ కోసం ప్యాన్‌లో అర కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై
చేసుకోవాలి.
7. మిక్సర్ జార్లో పల్లీలను వేసుకొని అరకప్పు పచ్చికొబ్బరను యాడ్
చేసుకోవాలి.
8. 5 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి.
9.అర టీ స్పూన్ జిలుకర, 4 పచ్చిమిరపకాయలను, ఒక నిమ్మకాయంత
చింతపండు
10. రుచి కోసం తగినంత ఉప్పు, ఈ మొత్తాన్ని గ్రైండ్ చేయాలి.
11. మిక్సీ జార్లో అరకప్పు నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేయాలి.
12. ప్యాన్‌లో 3 టీస్పూన్ల మంచినూనెను యాడ్ చేసుకోవాలి.
13.1 టీ స్పూన్ మినపప్పును, 1 టీ స్పూన్ ఆవాలను, 4 ఎండిమిరపకాయలను
వేసుకొని ఫ్రై చేయాలి.
14. కొన్ని కరివేపాకులను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తాన్నీ చట్నీలో
వేసి మిక్స్ చేయాలి.
15. 20 నిమిశాల తరువాత కలుపకున్న దోశ పిండిని తీసుకోవాలి.
16. రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి.
17. 1 టీ స్పూన్ ఇనో పౌడర్‌ను దోశపిండిలో వేసుకొని 1 టీస్పూన్ నీళ్లు
పోసుకొని బాగా కలుపుకోవాలి.
18. ప్యాన్ తీసుకొని స్టవ్‌పైన పెట్టి ఒక్కో గరిటతో దోశలను
వేసుకోవాలి.
19. మామూలు దోశ వేసేటప్పుడు స్ప్రెడ్ చేసినట్టు స్ప్రెడ్ చేయకుండా దోశ
వేయగానే అలాగే వదిలివేయాలి.
20.దోశవేయగానే పైన మూతపెట్టి 1 నిమిశం వరకు క్లోజ్ చేయాలి.
21. ఇక దీంతో స్పాంజ్ దోశ రెడీ అయినట్టే.
22. చట్నీతో కలుపుకొని స్పాంజ్ దోశను టేస్టీగా తినేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













