Latest Updates
-
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు
Maha Shivratri Special recipe: శివరాత్రి రోజు ఇది తింటే ఆకలి వేయదు, సింపుల్‌గా రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు, ఎ
మహాశివరాత్రి రోజు శివ భక్తులందరూ ఉపవాసం ఉంటూ శివుడిని కొలుస్తూ ఉంటారు. ఉపవాసం ఉండడం వలన కేవలం సాత్విక ఆహరం మాత్రమే తీసుకుంటారు. పండ్లు, కొన్ని కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. అయితే ఉపవాసం ఉండే వ్యక్తులు చిలకడ దుంపలను తీసుకోవచ్చు. ఇవి మంచి శక్తిని అందిస్తాయి. కాకపోతే వీటిని నేరుగా తినడం కొంతమందికి నచ్చకపోవచ్చు. అందుకే ఈ స్టోరీలో చిలకడ దుంపలతో హల్వా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిలకడ దుంపలతో హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు:
చిలకడ దుంపలు: 1/2 కిలో
పంచదార: 1 కప్పు
నెయ్యి: 1/4 కప్పు
పాలు: 1/2 కప్పు
యాలకుల పొడి: 1/2 టీస్పూన్
జీడిపప్పు, బాదం, కిస్‌మిస్: కొద్దిగా
తయారీ విధానం:
చిలకడ దుంపలతో హల్వా తయారు చేయడానికి ముందుగా డ దుంపలను శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి. దుంపలు చల్లారిన తర్వాత, వాటి తొక్క తీసి మెత్తగా మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేడి చేయాలి.
అందులో జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మాష్ చేసిన చిలకడ దుంపలను వేసి, మీడియం మంట మీద 5-7 నిమిషాలు వేయించాలి. అందులో పంచదార, పాలు వేసి బాగా కలపాలి. పంచదార కరిగి మిశ్రమం దగ్గరపడే వరకు ఉడికించాలి. ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసి కలపాలి. అలాగే చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. హల్వా పాన్ నుంచి విడిపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే చిలకడ దుంపలతో హల్వా సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












