Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
నోరూరించే టమోటా వెల్లుల్లి రసం.. ఇలా చేసుకుంటే, వేళ్ళు నాకుతూ తినేస్తారు! ఎలా చేసుకోవాలంటే?
Recipes
oi-Banothu Praveen Kumar
Posted By: Banothu Praveen Kumar
తెలుగు రాష్ట్రాల ప్రజలు భోజన ప్రియులు. పచ్చళ్ళు, రసాలు వంటి వాటితో పుష్టిగా భోజనం చేస్తుంటారు. తెలుగు ప్రజలకు రోటి పచ్చడి ఎంత ఇష్టమో, రసం కూడా అంతే ఇష్టం ఉంటుంది. అందుకే మధ్యాహ్నం సమయంలో అన్నంతో పాటు రసాన్ని కూడా కలుపుకొని తింటూ ఉంటారు. కొందరైతే కూర లేకుండా రసంతోనే లాగించేస్తారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఇష్టంగా తినే ఈ రసంలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి నోరూరించే రుచికరమైన టమోటా వెల్లుల్లి రసం. ఈ రసంతో ఒక్కసారి అన్నం తింటే దానితో మీరు ప్రేమలో పాడాల్సిందే. అయితే ఈ రసాన్ని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టమాటో వెల్లుల్లి రసం తయారీకి కావాల్సిన పదార్థాలు
- నాలుగు టొమాటోలు
- రెండు పచ్చిమిర్చి
- ఒకటి వెల్లుల్లి
- కొంచెం చింతపండు
- చిటికెడు పసుపు
- కొంచెం కొత్తిమీర గింజలు
- సరిపడా జీలకర్ర
- నల్ల మిరియాలు
- ఎండు మిరపకాయలు
- తొగరి పప్పు
- ఆవాలు
- ఇంగువ
- ఉప్పు
టమాటో వెల్లుల్లి రసం తాయారు చేసుకునే విధానం..
- ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందు.. నాలుగు టమోటాలను తీసుకొని, వాటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. అనంతరం ఆ ముక్కలను కుక్కర్‌లో వేసుకొని, రెండు పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అలాగే చింతపండు ముద్ద, సరిపడా ఉప్పు, ఒక లీటర్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. అనంతరం మూడు విజిల్స్ వచ్చే వరకు వాటిని ఉడికించుకోవాలి.
- ఇప్పుడు ఒక కడాయి తీసుకొని.. అందులో కొత్తిమీర, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెంసేపు ఆగి అందులోనే తొగరి పప్పు వేసుకొని వేయించుకోవాలి. అనంతరం వాటన్నిటినీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని.. బాగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ రుబ్బుకొని, ఆ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న టమోటా, పచ్చిమిర్చిని తీసేచి వాటిని కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటిని ఒక రసం మాదిరిగా చేసుకొని, తీసేసిన నీటిని మళ్ళీ అందులోనే కలుపుకోవాలి. ఆ రసంలో మనం చేసి పెట్టుకున్న పొడి మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ, సరిపడా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. అలాగే రుచికి మరింతగా రావడానికి కొంచెం బెల్లం వేసుకుంటే మంచిది. చివరగా తరిగిన కొత్తిమీరను రసం పైన పోసుకొని, అయిదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. వేడి వేడి టమోటా వెల్లుల్లి రసం సిద్ధమైపోతుంది. కానీ ఆ రసానికి తాలింపు వేయడానికి.. ఒక బాణీలో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేడివేడిగా ఉండగానే తీసేసి రసంపైన పోసుకుంటే తాలింపు సిద్ధమైపోతుంది.
- ఆ వెల్లుల్లి రసాన్ని అన్నంలో వేసుకొని, తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంతటి అద్భుతమైన వంటకాన్ని మీరూ ఓసారి ట్రై చేసి రుచి చూడండి. అచ్చమైన తెలుగు ఇంటి వంటకంతో మీ భోజనాన్ని మరింత రుచికరంగా మార్చుకోండి.
Comments
More From
Boldsky
Prev
Next
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
[ of 5 - Users]
English summary
How to make tasty garlic tomato rasam at home.. Here is the ingredients to make it
Story first published: Thursday, November 7, 2024, 15:23 [IST]
Other articles published on Nov 7, 2024



Click it and Unblock the Notifications












