For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటో వంటకాల్లో ఆమ్లత్వాన్ని తగ్గించడం ఎలా?

|

మీ వంటకాలకు టమాటో అద్భుతమైన రుచిని, పోషకాలను జత చేస్తుంది. ఐతే వాటి నుంచి వచ్చే ఆమ్ల సారాన్ని తగ్గిస్తే రుచి ఇంకా మధురమౌతుంది, అల్సర్ల లాంటివి వుండి ఆమ్లాలు ఉండే ఆహార పదార్ధాలు తినలేనివారికి కూడా తేలిగ్గా వుంటుంది.

విధానం:

1. తోలు తీసివేయండి (ఇష్టమైతే). ఎర్రని టమాటో లను ఉడికే నీటిలో వేసి కొన్ని నిమిషాల పాటు ఉండనిచ్చి చల్లార నివ్వండి. పటకారతో వాటిని బయటికి తీసి చల్లటి నీటితో నింపిన గిన్నె లో వేయండి. వదులైన తోళ్ళు తీసేయండి.

2. టమాటోలను ముక్కలుగా కోయండి.

3. ఒక పాన్ లో వుంచి 15 నిమిషాల పాటు మధ్యస్తమైన మంట మీద ఉడకనివ్వండి. టమాటోలు వెచ్చగా వుంటే ఆమ్లాన్ని తటస్థం చేసే ప్రతిక్రియ బాగా పనిచేస్తుంది.

4. వేడి మీది నుంచి తీసివేసి ఆరు మధ్య సైజు టమాటో లకు పావు టీస్పూన్ బేకింగ్ సోడా చొప్పున వేసి కలపండి. బేకింగ్ సోడా టమాటలతో కలిసి ఆమ్లాన్ని తటస్థం చేస్తుంది.

5. బుడగలు రావడం ఆగిపోయాక, మీ వంటకం తయారు చేయడానికి ఇతర పదార్ధాలు కలపండి.

How to Reduce Acid in Tomato Dishes

చిట్కాలు:

తాజా, పండిన కాయల కంటే డబ్బాల్లో వచ్చే టమాటోల్లో ఆమ్ల శాత౦ ఎక్కువగా ఉంటు౦ది. సాధారణంగా ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఆమ్లం అవసరమే.

తక్కువ, మధ్యస్త ఆమ్లాలు ఉండే రకాల టమాటో లను ఎంచుకోండి. మీ టమాటోల్లో తక్కువ ఆమ్ల శాతం వుంటే మీరు తక్కువ టమాటోలలో ఆమ్లాన్ని తగ్గించాలి.

బాగా మగ్గిన టమాటో లను ఎంచుకోండి - పండని వాటిలో ఆమ్ల శాతం ఎక్కువగా ఉంటుంది.

వండిన టమాటో లను ఫ్రిజ్ లో వుంచి తరువాత వాడుకోవచ్చు.

వంటకం లోకి బ్రౌన్ షుగర్ కలిపినా లేదా చల్లినా ఆమ్లశాత౦ తగ్గుతుంది.

ఒక విడత సాస్ లేదా మిర్చికి ఒక పావు టీస్పూన్ జాజికాయ లేదా దాల్చిన చెక్క వాడినా ఆమ్ల శాతం తగ్గుతుంది.

ఒక కారెట్ లేదా పావు ముక్క బంగాళాదుంపను అందులో ఒక అర గంట ఉడకనిచ్చి తీసివేయండి. బయటకు తీయగానే అది పుల్లగా లేదా ఊరగాయలా ఉంటుంది ఎందుకంటే అది ఆమ్లంలో నానింది కాబట్టి. లేదా పావు కారెట్ ముక్క లేదా బంగాళాదుంప ముక్క తురిమి వంటకంలో వేసి వదిలేయండి.

టమాటో సాస్ వండేటప్పుడు దానికి గ్యాస్ట్రిక్ కలపడం ఆమ్లాన్ని తగ్గించడానికి అన్నిటికన్నా ఉత్తమం, రుచికరమైన మార్గం. రైస్ వైన్ వినేగార్ లో చక్కెరను కలిపి ఒక పాకం లాంటి పదార్ధం తయారయ్యేదాకా వుంచండి. సాస్ కి, లేదా ఉడికిన టమాటో లకు దీన్ని కలపండి.

హెచ్చరికలు:

చేతులు కాలకుండా వేడి టమాటోలను జాగ్రత్తగా పట్టుకోండి.

సోడియం తక్కువ ఆహారాలను తీసుకునే వారు బేకింగ్ సోడా లో వుండే అధిక సోడియం శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

English summary

How to Reduce Acid in Tomato Dishes | టమోటో వంటకాల్లో ఆమ్లాన్ని తగ్గించడం ఎలా?

Tomatoes can add wonderful flavor and nutrition to your favorite recipes. However, reducing their acid content will mellow the flavor, and make the meal easier on people who have a low tolerance for acidic foods, such as those with ulcers.
Story first published: Friday, January 11, 2013, 19:03 [IST]
Desktop Bottom Promotion