For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Curd Sandwich Recipe : పెరుగు శాండ్ విచ్.. రుచికి లొట్టలేయాల్సిందే

పెరుగు శాండ్ విచ్ అయితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచిగా ఉంటుంది.

|

Curd Sandwich: శాండ్ విచ్ అనగానే చాలా మందికి నోరూరుతుంది. ఇది చాలా హెల్దీ ఫుడ్. స్నాక్ ఐటెంగా శాండ్ వించ్ ను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ గా కూడా తింటారు. శాండ్ విచ్ లో చాలా రకాలు ఉన్నాయి. ఎవరి అభిరుచికి తగ్గట్లు వారు శాండ్ విచ్ ను తయారు చేసుకుని లొట్టలేసుకుంటూ తినాల్సిందే.

Curd Sandwich Recipe in Telugu

పెరుగు శాండ్ విచ్ అయితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచిగా ఉంటుంది. అసలు పెరుగు శాండ్ విచ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Curd Sandwich Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు:

1. బ్రెడ్ - 4 స్లైస్ లు
2. క్యారెట్ - 1
3. చక్కెర పొడి - అవసరంమేరకు
4. స్వీట్ కార్న్ - 1/4 కప్పులు
5. క్యాబేజీ - 3/4 కప్పులు
6. మిరియాలు - రుచి కోసం
7. క్యాప్సికం - 1/4 కప్పులు

Curd Sandwich Recipe in Telugu

ఎలా తయారు చేయాలి:

మొదట మంచి గడ్డ పెరుగు తీసుకోవాలి. దానిని ఒక గుడ్డలో వేసి నీళ్లు పోయేలా గట్టిగా కట్టి వడకట్టాలి.ఓ రెండు గంటల వరకు దానిని పక్కన పెట్టాలి. ఆ సమయం వరకు పెరుగులోని నీరంతా పోతుంది. తర్వాత గుడ్డలోని పెరుగును వేరు చేయాలి. ఆలోపు స్వీట్ కార్న్ ఉడకబెట్టాలి.

Curd Sandwich Recipe in Telugu

నీరు వేరు చేసిన పెరుగును ఓ గిన్నెలో తీసుకోవాలి. ముందుకు ఉడకబెట్టి పక్కన పెట్టిన స్వీట్ కార్న్, క్యాబేజీ తురుము, సన్నగా తరిగిన క్యారెట్, చిన్నగా కోసి పక్కన పెట్టుకున్న క్యాప్సికం వేసి బాగా కలపాలి. తర్వాత అందులో కొద్దిగా చక్కెర పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని మిరియాలు వేసి మిక్స్ చేయాలి.

Curd Sandwich Recipe in Telugu

తర్వాత బ్రెడ్ స్లైస్ లను తీసుకుని వాటి అంచులను కట్ చేసుకోవాలి. తయారు చేసి పక్కన పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని బ్రెడ్ పైన సమాంతరంగా పరుచుకోవాలి. దానిపై మరో బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి.

Curd Sandwich Recipe in Telugu

బ్రెడ్ పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే.. బ్రెడ్ స్లైస్ లను టోస్ట్ చేసుకోవాలి. తర్వాత వాటిపై పెరుగు మిశ్రమాన్ని పరుచుకోవాలి. అంతే బ్రెడ్ శాండ్ విచ్ రెడీ అయినట్లే. పక్కనే సాస్ తో సర్వ్ చేసుకోవడమే లేట్. నోరూరించే కర్డ్ శాండ్ విచ్ తింటూ లొట్టలేయాల్సిందే.

English summary

Curd Sandwich Recipe in Telugu

read on to know Curd Sandwich Recipe in Telugu
Desktop Bottom Promotion