For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Telangana Cuisine :తెలంగాణలో ఫుడ్ లవర్స్ కోసం ప్రతి ఏటా ఫుడ్ ఫెస్టివల్.. ఇక్కడ ఏమి ఫేమసో చూసెయ్యండి...

తెలంగాణలో ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఏవో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Telangana Cuisine : Famous Food Items of Telangana

ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో తెలంగాణ పండుగ రాబోతోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర పండుగను పురస్కరించుకొని రాజధాని నగరమైన భాగ్యనగరంలో ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా హైదరాబాదీలను అలరించేందుకు అన్ని రకాల రుచులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఇంతకుముందు నెక్లెస్ రోడ్డులో ఉన్న పీపుల్స్ ప్లాజాలో నిర్వహించేవారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని సంప్రదాయ వంటకాలను రుచికరంగా తయారుచేసి నగరవాసులకు అందజేస్తారు.

ఇంతకుముందు కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి కాస్త బ్రేకులు పడ్డప్పటికీ.. ఈ ఏడాది మళ్లీ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దొరికే వంటకాలతో పాటు ఇక్కడి కల్చర్ ను ప్రతి ఒక్కరినీ అలరించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఫుడ్ పెస్టివల్ లో తెలంగాణ సంప్రదాయ రుచులతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రాంతంలో ఉండే కొత్త రకం వంటకాలను సిద్ధం చేసేందుకు మహిళలు ఈ ఈవెంట్లో పాల్గొనడం విశేషం.

Telangana Cuisine : Famous Food Items of Telangana

2022 సంవత్సరంలో కూడా జూన్ మాసంలో ప్రారంభమయ్యే ఈ ఫుడ్ ఫెస్టివల్ మూడు రోజుల పాటు జరగనుంది. ఇంతకుముందు ఈ ప్రదర్శనకు హైదరాబాదీల నుండి విశేష స్పందన లభించింది. కరోనా తర్వాత నిర్వహిస్తున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ కోసం ఫుడ్ లవర్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ప్రద్శనలో ఎలాంటి వంటకాలు ఎక్కువగా ప్రదర్శనలో ఉంచుతారు. శాకాహారం, మాంసాహారం ఇతర ఆహార పదార్థాలలో నగరవాసులు వేటిని ఎక్కువగా ఇష్టపడతారు. సందర్శకులను ఎక్కువగా ఆశ్చర్యపరిచే, ఆకట్టుకునే రుచికరమైన వంటకాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

పిండి వంటకాలలో ఇవి కచ్చితంగా ఉంటాయి.
సకినాలు, మురుకులు, చెక్కగారెలు, బూందీ, లడ్డు, పల్లీ చెక్కలు, సర్వపిండి వంటి వాటితో పాటు ఇంకా ఎన్నో రకాల రుచికరమైన పిండి వంటకాలు ఇక్కడ మనం రుచి చూడొచ్చు.

ఇక మాంసాహారం విషయానికొస్తే.. సాధారణంగా హైదరాబాదీ బిర్యానీ గురించి మనలో చాలా మందికి తెలిసిందే. ఎక్కువ మంది దమ్ బిర్యానీ గురించే చెబుతారు. అయితే ఇదొక్కటే అంకాపూర్ చికెన్, పథర్ కా ఘోష్, చికెన్ పకోడ, నాటుకోడి కర్రీ, చేపల పులుసు, పాయ, జొన్న చికెన్, పుంటికూర చికెన్ విరివిగా లభిస్తాయి. వీటితో పాటు మటన్ లలో కొన్ని రకాల వెరైటీలు(తలకాయ, భేజా, భోటి), లివర్ ఫ్రై వంటివి కచ్చితంగా దొరుకుతాయి.

స్నాక్స్ లలో కూడా ఇక్కడ చాలా వెరైటీలు లభిస్తాయి. మిర్చీ బజ్జీ, ఆలూ బజ్జీ, అప్పడాలు, పెసర గుడాలు, శనగ గుడాలు, కొబ్బరి గుడాలు వంటివి కూడా రుచికరంగా ఉంటాయి..

అంతేకాదండోయ్ రకరకాల దోశలు, తొక్కు అన్నం, రాగి బేబీ కార్న్ వంటకాలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది.

ఈ ఫుడ్ పేర్లన్నీ మీకు నోరూరుతోందా? అయితే రెడీగా ఉండండి. ఎలాగో ఇది మూడు రోజుల పాటు ఉంటుంది. అందులోనూ శని, ఆదివారం చాలా మందికి సెలవు కాబట్టి.. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎంచక్కా నెక్లెస్ రోడ్లలో సరదాగా తినుకుంటూ తిరిగేలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ కేవలం ఫుడ్ మాత్రమే కాదు.. ఫన్ ప్రోగ్రామ్స్ చాలా గమ్మత్తుగుంటాయి. ఇక్కడ మీకు సమయం ఎలా అయిపోతుందో తెలియదంటే నమ్మండి.. ఇక భోజన ప్రియులు ఈ ఫుడ్ ఫెస్టివల్ అస్సలు మిస్సవ్వకుండా ముందే జాగ్రత్త పడండి. ఈ ఫుడ్ ఫెస్టివల్ సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండి నగరవాసులను అలరిస్తుంది.

English summary

Telangana Cuisine : Famous Food Items of Telangana

Here we are talking about the Telangana cuisine:Famous food items of Telangana. Take a look
Desktop Bottom Promotion