ఈ చట్నీ తింటే మీ బాడీలో చెడు కొవ్వు ఉండదు, గుండె జబ్బులు కూడా రావు

మారిన జీవన శైలి, మారుతున్న తినే ఆహరం, ఇతర అలవాట్ల కారణంగా ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. గుండె సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణం చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వలన, అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల డైట్స్, వర్క్ ఔట్స్ చేస్తుంటారు. అయితే ఎవరికైతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయుందో వారు ఈ చట్నీలను తినడం వలన అనేక మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్య కూడా రాదు. ఆ చట్నీలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పుదీనా పచ్చడి

పుదీనా పచ్చడిలో ఫైబర్, క్లోరోఫిల్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పచ్చడిని తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. రోజుకు ఒకసారి ఈ పచ్చడిని మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

మెంతికూర పచ్చడి

మెంతి ఆకులతో తయారు చేసిన పచ్చడిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మెంతి పచ్చడిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనితో పాటు మీరు మెంతి ఆకులతో పచ్చడి మాత్రమే కాకుండా పలు వంటలు కూడా చేసుకోవచ్చు.

పాలకూర పచ్చడి

పాలకూరలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ధమనుల్లో రక్తగడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. పాలకూర ఆకులు, కొత్తిమీర, పుదీనా కలిపి ఈ చట్నీ తయారుచేయవచ్చు.

బతువా చట్నీ

బతువాలో ఉన్న ఫైబర్, రఫ్టేజ్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు, అలాగే జీర్ణవ్యవస్థను కూడా సక్రమంగా ఉంచుకోవచ్చు.

కరివేపాకు చట్నీ

కరివేపాకులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధ గుణాలు చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడతాయి. ఈ చట్నీ కూరగాయల్లో చేర్చుకొని తయారుచేసి తినవచ్చు. అలాగే నేరుగా కరివేపాకుతో పచ్చడి చేసుకొని కూడా తీసుకోవచ్చు.

మీ బ్రేక్ ఫాస్ట్‌కి దోశ, ఇడ్లీ, ఉప్మా వంటివి ఈ చట్నీలతో తినడం ద్వారా మీరు మంచి బలీష్టమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతారు.

[ of 5 - Users]
Story first published: Thursday, January 30, 2025, 9:58 [IST]
Desktop Bottom Promotion