Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
పేదవాడి అమృతం.. జొన్న అంబలి ఇలా చేస్తే..రుచి అమోఘం,ఆరోగ్యం సుస్థిరం!
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తర్వాత మళ్ళీ మనం చిరుధాన్యాల వైపు చూస్తున్నాం. అందులో ముఖ్యమైనది జొన్నలు. జొన్నలతో చేసే అత్యంత బలవర్ధకమైన, రుచికరమైన పానీయం జొన్న అంబలి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది ఒక సంజీవని లాంటిది. దీనిని పేదవాడి అమృతంగా పిలుస్తారు. వేసవిలో వచ్చే డీహైడ్రేషన్ సమస్యకు జొన్న అంబలి సరైన పరిష్కారం.
బరువు తగ్గాలనుకునే వారికి జొన్న అంబలి ఒక అద్భుతమైన ఆహారం. ఇది ఎముకలను దృఢంగా ఉంచడానికి,రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, తరచుగా జలుబు, జ్వరం బారిన పడేవారికి ఇది మేలు చేస్తుంది. జొన్న అంబలిని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి పులియబెట్టినది, రెండవది తక్షణమే చేసుకునేది. పులియబెట్టిన అంబలి ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టమైనది..దీనిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
జొన్న పిండి - 1 కప్పు
నీళ్లు - 4-5 కప్పులు
మజ్జిగ (పుల్లనిది) - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ ముక్కలు - చిన్నవి
పచ్చిమిర్చి - 1
కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా
జీలకర్ర పొడి - అర టీస్పూన్
తయారీ విధానం
-అంబలి రుచిగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే ముందు రోజు రాత్రే జొన్న పిండిని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో జొన్న పిండిని తీసుకొని, అందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా (సుమారు 8-10 గంటలు) పులియనివ్వాలి. ఇలా చేయడం వల్ల పిండిలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
-మరుసటి రోజు ఉదయం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె లేదా మట్టి పాత్రను పెట్టండి. అందులో 3-4 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి.
-ఇప్పుడు ముందు రోజు రాత్రి నానబెట్టిన జొన్న పిండి మిశ్రమాన్ని తీసుకుని, మరుగుతున్న నీటిలో మెల్లగా పోస్తూ, గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆపకుండా తిప్పడం చాలా ముఖ్యం, లేకపోతే పిండి ఉండలు కట్టేస్తుంది.
-మంటను మీడియం లేదా సిమ్ లో పెట్టి పిండి దగ్గర పడే వరకు (సుమారు 10-15 నిమిషాలు) ఉడికించాలి. మిశ్రమం చిక్కగా మారి మంచి వాసన వస్తుంది. పిండి పచ్చి వాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అంబలిని పూర్తిగా చల్లారనివ్వాలి.
-అంబలి పూర్తిగా చల్లారిన తర్వాత, అందులో చిలికిన మజ్జిగను కలపాలి. మజ్జిగను అంబలి చిక్కదనాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు.
-చివరగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన జొన్న అంబలి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











