Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఇలా చిటికెలో జొన్న అంబలి రెడీ.. తాగితే శరీరానికి చాలా చలువ..!
ఎండలు బాగా మండిపోతున్నాయి. కూల్ డ్రింకులతో ఐస్ క్రీములతో కడుపును చల్లబరుచుకుంటున్నాం. కానీ అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కేవలం పళ్ళు రాసాలను, మజ్జిగ, జావ లాంటి సహజమైన పానియాలు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. బయట దొరికే కూల్ డ్రింక్స్ లలో కార్బన్ ఇతర హానికరమైన రసాయనాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పానియాలని మన పూర్వీకులు పెద్దలు మనకు అందించారు వాటిని మనం మరిచిపోయాం. ఇప్పటికైనా వాటి విలువ తెలుసుకొని ఆ పానియాలను ఈ వేసవిలో తాగి డిహైడ్రేట్ కాకుండా చూసుకుందాం. ఈ వేసవిలో మీకోసం ప్రత్యేకంగా జొన్న జావ రెసిపీని తీసుకొని వచ్చాము. చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయొచ్చు. జొన్న జావను ఎలా చేయాలో తెలుసుకుందాం.
డయాబెటీస్ తో బాధపడేవారికి జొన్న జావ చాలా మేలు చేస్తుంది, చెక్కర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా జొన్న జావ వాళ్ల బరువు పెరగకుండా వుంటారు. జొన్న అంబలి లో కొవ్వు పాదార్ధాలు ఉండవు. ఇప్పుడు జొన్న అంబలిని ఎలా చేయాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకొని బాగా కడగి ఆ జొన్నలను ఎండలో ఆరబెట్టాలి. ఆరిన ఆ జొన్నలను ఇంట్లో వున్న మిక్సీ లో గ్రైండ్ గ్రైండ్ చేయాలి. మిక్సిలో రెడీ అయిన జొన్న పిండిని ఒక బౌల్ లో తీసుకొని. అందులోంచి అర కప్పు జొన్న పిండిని జొన్న అంబలి కోసం తీసుకోవాలి.
అర కప్పు జొన్న పిండిలో తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఉండలు రాకుండా చూసుకోవాలి. ఉండలు ఉంటే వాటిలో జొన్న పిండి అలాగే ఉంటుంది కాబట్టి ఉండలు లేకుండా చూసుకోవాలి. జొన్న పిండి ఎనిమిది గంటలు నానిన తరువాత మూత తీసి మామూలుగా ఒక సారి కలుపుకోవాలి.
ఇప్పుడు జొన్న జావను కలపడానికి ఒక పాన్ ను తీసుకొని అందులో రెండు గ్లాసుల నీళ్లను వేసి మరిగించాలి. నీళ్లు బాగా ఉడికిన తరువాత అందులో మనం ముందుగా కలుపుకున్న జొన్న జావాను వేయాలి. ఇప్పుడు ఆ జావను మొత్తం ఎలాంటి ఉండలు లేకుండా కలుపుతూనే వుండాలి. సుమారు 10 నిమిశాల పాటు అలాగే కలుపుతూ వుండాలి. అయితే గట్టిపడకుండా చూసుకోవాలి. గట్టిగా చిక్కగా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దింపేసుకోవచ్చు.
దీంతో జొన్న జావ రెడీ అయినట్టే. ఈ జొన్న జావవల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు. దీన్ని పెద్దలు మాత్రమే తాగాలని తాగుతారని, షుగర్ పేషెంట్లు మాత్రమే తాగుతారని ఒక అపోహ వుంటుంది. జొన్న జావను చిన్న పిల్లలు కూడా తాగవచ్చు. వేడిగా అలాగే తాగొచ్చు లేదా చల్లగానైనా తాగొచ్చు అది మీ ఇష్టం. ఈ జొన్న జావలో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలుపుకుంటే టేస్ట్ ఇంకా బాగుండడమే కాకుందా చలవ కూడా. అయితే పెరుగులో జొన్న అంబలిలో అలాగే వేసుకొకుండా ముందుగా పెరుగులో కొన్ని నీళ్లు పొసుకొని కలుపుకొని తరువాత ఆ చిక్కటి పెరుగును అంబలిలో కలుపుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, పూదీన, పచ్చి మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












