Latest Updates
-
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి!
మహారాష్ట్ర స్పెషల్ పోహ లడ్డు..తక్కువ సమయంలో సూపర్ టేస్ట్..ఎలా చేసుకోవాలంటే
పోహ లడ్డు ఒక రుచికరమైన,ఆరోగ్యకరమైన భారతీయ స్వీట్. ఇది ముఖ్యంగా మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ లడ్డును అటుకుల లడ్డూ అని కూడా పిలుస్తారు. దీనిని తయారు చేయడం చాలా సులభం. దీనికి కావలసిన పదార్థాలు కూడా ఇంట్లో సులభంగా లభిస్తాయి. ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థం దాని సొంత పోషక విలువలను కలిగి ఉంటుంది. మహారాష్ట్ర స్పెషల్ పోహ లడ్డూని తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పోహ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు
-అటుకులు - 2 కప్పులు
-పల్లీలు - 1/2 కప్పు
-నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
-కొబ్బరి తురుము (ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి) - 1/2 కప్పు
-బెల్లం తురుము - 1 కప్పు
-నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
-యాలకుల పొడి - 1/2 టీ స్పూన్
-జీడిపప్పు, బాదం పప్పు - 2 టేబుల్ స్పూన్లు
పోహ లడ్డు తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో 2 కప్పుల అటుకులు వేసి చిన్న మంట మీద 5-7 నిమిషాలు వేయించాలి. పోహ క్రిస్పీగా మారే వరకు వేగాక దానిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-అదే కడాయిలో 1/2 కప్పు పల్లీలు వేసి చిన్న మంట మీద వేయించాలి. పల్లీల పొట్టు ఊడిపోయి, అవి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. వేగిన పల్లీలను చల్లార్చి, పొట్టు తీసివేయాలి.
-ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి దోరగా వేయించాలి. నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది.
తమిళనాడు స్పెషల్ దిండిగల్ చికెన్ బిర్యానీ..మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
-చల్లారిన పోహను మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా బరకగా పొడి చేసుకుంటే లడ్డు రుచిగా ఉంటుంది.
-వేయించిన పల్లీలను మిక్సీలో వేసి కొద్దిగా బరకగా దంచాలి. మరీ మెత్తని పొడిలా కాకుండా పలుకులుగా ఉంటే బాగుంటుంది.
-ఒక చిన్న గిన్నెలో బెల్లం తురుము మరియు 1-2 టేబుల్ స్పూన్ల నీరు వేసి చిన్న మంట మీద కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి పాకం రాకుండానే స్టవ్ ఆఫ్ చేయాలి. కరిగించిన బెల్లం కొద్దిగా చల్లారనివ్వాలి.
-ఒక పెద్ద గిన్నెలో పొడి చేసిన పోహ, దంచిన పల్లీలు, వేయించిన నువ్వులు, కొబ్బరి తురుము, యాలకుల పొడి, తరిగిన జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి.
-ఇప్పుడు కరిగించిన లేదా తురిమిన బెల్లంను ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి. బెల్లం మొత్తం మిశ్రమానికి పట్టేలా చేత్తో బాగా కలపాలి.
-చివరగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరొకసారి బాగా కలపాలి. నెయ్యి వేయడం వల్ల లడ్డులు మరింత రుచిగా వస్తాయి.
-ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని మీకు కావలసిన సైజులో లడ్డులుగా చుట్టుకోవాలి. మిశ్రమం పొడిగా అనిపిస్తే మరికొద్దిగా నెయ్యి వేసి కలపవచ్చు.
-కావాలనుకుంటే లడ్డుల పైన జీడిపప్పు లేదా బాదం పలుకులతో అలంకరించవచ్చు. ఈ లడ్డులను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే వారం రోజుల వరకు ప్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







