Mutton Bone soup: ఎముకలకు బలం ఇచ్చే మటన్ సూప్.. సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలంటే?

మటన్ అనేది ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే వంటకం. పోషకాహారాలతో పాటు ఖనిజాలు ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మటన్‌తో సూప్ తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరి రుచికి తగ్గట్టుగా, ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఈ మటన్ సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మటన్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు

  1. ఎముకలు ఉన్న మటన్ ముక్కలు
  2. ఉల్లిపాయ
  3. తోటకూర
  4. క్యారెట్
  5. బీట్‌రూట్
  6. ఆవాలు
  7. జీలకర్ర
  8. దాల్చిన చెక్క
  9. లవంగాలు
  10. పసుపు
  11. మిరియాల పొడి
  12. కారం పొడి
  13. కొత్తిమీర
  14. రుచికి సరిపడా ఉప్పు
  15. నూనె

మటన్ సూప్ తయారీ విధానం

ఈ మటన్ సూప్ తయారు చేసుకోవడానికి ముందుగా ఎముకలు కలిగిన మటన్ ముక్కలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక అందులో మటన్ ముక్కలను జత చేసుకోవాలి. అలాగే అందులోనే సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి.

ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో కొంచెం నూనె వేసుకోవాలి. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తరువాత అందులో పచ్చిమిర్చి, పసుపు వేసుకొని కలుపుకోవాలి.

ఆ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. అందులోనే మిరియాలు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నాలుగు విజిల్స్ తరువాత మూత తీసి, అందులో క్యారెట్, బీట్ రూట్ ముక్కలను వేసుకోవాలి. అలాగే తోటకూర కూడా వేసుకొని మూత వేసుకొని మరో అయిదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, ఎంతో రుచికరమైన మటన్ సూప్ సిద్ధమైనట్లే.

దీనిని సూప్ మాదిరిగా తాగేయొచ్చు లేకపోతే అన్నంలో కలుపుకొని అన్నా తినేయొచ్చు. ఎలా తిన్నా దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
మటన్ సూప్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ మటన్ ఎముకల సూప్‌లో కొల్లాజెన్, గ్లూకోసామినోగ్లికాన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు కావాల్సిన బలాన్ని అందిస్తాయి. అలాగే ఎముకలను ధృడంగా మారుస్తాయి. ఎముకలకు సంబంధించిన రోగాలు కూడా నయమవుతాయి. అలాగే ఈ సూప్‌లో ఉండే విటమిన్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అదే విధంగా కండరాలను బలంగా మారుస్తుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, December 7, 2024, 14:12 [IST]
Desktop Bottom Promotion