Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
అటుకులు, బెల్లంతో కమ్మని హల్వా..లొట్టలేసుకుంటూ తింటారు!
వేడి వేడి నెయ్యి గుమగుమలు.. దానికి తోడుగా యాలకుల సుగంధం..అలా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే అద్భుతమైన తీపి. అబ్బా, ఊహించుకుంటుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదూ. అదేనండీ మన అటుకుల హల్వా. ఈ ప్రత్యేకమైన స్వీట్ ను ఒక్కసారి మీ ఇంట్లో చేసిపెట్టారంటే, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే.
మనం తరచుగా చేసుకునే పాయసం లేదా ఇతర సాంప్రదాయ స్వీట్ల రుచిని సైతం మరిపించేంత అద్భుతంగా ఉంటుంది ఈ స్వీట్. పండుగ రోజుల్లో, ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భంలో లేదా సాయంత్రం వేళ ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా క్షణాల్లో ఈ స్వీట్ సిద్ధం చేసుకోవచ్చు. నోరూరించే అటుకుల హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బెల్లం తురుము - 1 కప్పు
నీళ్లు - 2 కప్పులు
యాలకులు - 3
అటుకులు - ఒకటిన్నర కప్పులు
నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు
బాదం పప్పులు -10
జీడిపప్పు - 7-8
ఎండు ద్రాక్ష- 8
ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ముక్కలు - 1 కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోసి, కప్పు బెల్లం తురుము వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేలా తిప్పుతూ ఉండాలి.
-బెల్లం కరిగిన తర్వాత అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. ఆ నీటిని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మందపాటి కడాయి లేదా పాన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక ముందుగా బాదం, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత కిస్మిస్, కొబ్బరి ముక్కలను కూడా వేసి మంచి సువాసన వస్తూ, గోధుమ రంగులోకి మారే వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో మరో చెంచా నెయ్యి వేసి, అటుకులను వేయాలి. మంటను తక్కువగా ఉంచి అటుకులు కమ్మని వాసన వస్తూ, లేత గోధుమ రంగులోకి (క్రంచీగా) మారేంత వరకు ఓపిగ్గా వేయించుకోవాలి.
-అటుకులు పర్ఫెక్ట్ గా వేగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం నీటిని జాగ్రత్తగా అందులో పోయాలి. అటుకులు ఆ బెల్లం నీటిని పీల్చుకుని మెత్తగా ఉడికి, ఉబ్బే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి.
-అటుకులు పాకాన్ని పూర్తిగా పీల్చుకుని, దగ్గరపడి హల్వా ఆకృతికి వచ్చిన తర్వాత.. మిగిలిన నెయ్యిని పైన చల్లాలి. చివరగా మనం ముందుగానే నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి, అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఘుమఘుమలాడే, అత్యంత రుచికరమైన అటుకుల హల్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











