మిల్క్ బక్లవ కేక్ ను తయారుచేసే విధానం: క్రిస్మస్ స్పెషల్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మిల్క్ బక్లవ కేక్ అనే రెసిపీను ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇది ప్రఖ్యాతిగాంచిన గ్రీక్ డెసెర్ట్. మృదువుగా, మెత్తగా ఉండే ఈ పాకం కేక్ ఎంతో అద్భుతమైన రుచితో నిండి మీ టేస్ట్ బడ్స్ ని సంతృప్తిపరుస్తుంది.

మీరు చేయాల్సిందల్లా పాల కేక్ ను ఇప్పుడు చెప్పుకోబడుతున్న రెసిపీతో బక్లవగా మార్చడమే. ఈ అమోఘమైన డెసెర్ట్ ఇలాచీ ఫ్లేవర్ తో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అద్భుతమైన ఈ స్వీట్ డిష్ నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది.

టీటైం కి తీసుకునే సరైన స్నాక్ ఇది. తీయగా ఉన్నా తీపి అతిగా ఉండదు. JW మారియట్ లో ఎగ్జిక్యూటివ్ చెఫ్ అయిన విశాల్ ఆత్రేయ తయారుచేసే మిల్క్ కేక్ బక్లవ పండుగల సమయంలో చక్కటి ఐటెం గా పనికొస్తుంది.

milk cake baklava
మిల్క్ కేక్ బక్లవ ! మిల్క్ కేక్ బక్లవను తయారుచేసే విధానం | మిల్క్ బక్లవ కేక్ ను తయారుచేసే విధానం | మిల్క్ బక్లవ కేక్ ను తయారుచేసే విధానం
మిల్క్ కేక్ బక్లవ ! మిల్క్ కేక్ బక్లవను తయారుచేసే విధానం | మిల్క్ బక్లవ కేక్ ను తయారుచేసే విధానం | మిల్క్ బక్లవ కేక్ ను తయారుచేసే విధానం
Prep Time
25 Mins
Cook Time
1H0M
Total Time
1 Hours25 Mins

Recipe By: చెఫ్ విశాల్ ఆత్రేయ, ఎగ్జిక్యూటివ్ చెఫ్, W Marriott

Recipe Type: డెసెర్ట్

Serves: 12

Ingredients
 • ఫిలో షీట్స్ - 10

  మిల్క్ కేక్ (మిఠాయి) - 7 - 8

  తరిగిన పిస్తాపప్పు - 1/2 కప్పు

  నెయ్యి - 3/4 th కప్పు

  పంచదార - 2 కప్పులు

  నీళ్లు - 2 కప్పులు

  రోజ్ వాటర్ - 5-6 టేబుల్ స్పూన్లు

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. బేకింగ్ ట్రే ను తీసుకోండి.

  2. ఫిలో షీట్స్ ను తెరవండి.

  3. బేకింగ్ ట్రే పైన ఫిలో షీట్స్ ను పరవండి.

  4. బేకింగ్ ట్రే పైన పరిచిన ఫిలో షీట్స్ పై నెయ్యిని అద్దండి.

  5. ఫ్రెష్ బౌల్ ని తీసుకుని మిల్క్ కేక్ ని పొడిలా చేయండి.

  6. ఇప్పుడు పిస్తాపప్పు పొడి ని ఆ బౌల్ లో జోడించండి.

  7. ఈ రెండిటిని బాగా కలపండి.

  8. ఇప్పుడు, ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని తీసుకుని బేకింగ్ ట్రే పైన అమర్చబడిన ఫిలో షీట్ పైన పరవండి.

  9. మళ్ళీ, ఫిలో షీట్ పై నేతిని అద్దండి. ఇప్పుడు, పొడిగా చేసుకున్న మిల్క్ కేక్ ని అలాగే పిస్తాపప్పు పొడిని ఒక లేయర్ లా పరవండి. మరొక ఫిలో షీట్ తో వీటిని కవర్ చేయండి.

  10. పైన చెప్పిన స్టెప్స్ ని 10 షీట్స్ ల మిశ్రమం వచ్చే వరకు పాటించండి.

  11. 10 వ షీట్ వద్దకు రాగానే, పేస్ట్రీని సమానంగా ప్రెస్ చేయండి.

  12. ఫిలో షీట్ పైన నెయ్యిని అద్దండి.

  13. ఈ ట్రే ను 1 గంటపాటు రెఫ్రిజిరేట్ చేయండి.

  14. ఒక గంట తరువాత రిఫ్రిజిరేటర్ లోంచి ఈ ట్రేను తీసి సాధారణ టెంపరేచర్ కు వచ్చే వరకు ఒక పక్కన ఉంచండి.

  15. ఒక గంట తరువాత, ట్రేలో నున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరగండి.

  16. ఇప్పుడు, ఈ బేకింగ్ ట్రేను ఓవెన్ లో పెట్టి 20 నిమిషాలపాటు 180 డిగ్రీల సెంటీగ్రేడ్ లో బేక్ చేయండి.

  17. ఈలోగా, ప్యాన్ ను హై ఫ్లేమ్ లో ఉంచండి.

  18. ప్యాన్ లో పంచదారను వేయండి.

  19. ఇప్పుడు, ప్యాన్ లోకి నీళ్లను జోడించండి.

  20. తీగ పాకం వచ్చేవరకు పంచదారని పాకం పట్టండి.

  21. ఇప్పుడు ఓవెన్ లోంచి ట్రే ని బయటకు తీయండి.

  22. బేక్ చేయబడిన ఈ మిశ్రమాన్ని బక్లావా అనంటారు.

  23. ఈ బక్లావాపై మనం తయారుచేసుకున్న పంచదార పాకాన్ని పోయండి.

  24. ఇప్పుడు, ట్రేలో బ్యాక్లావా కేక్ లను విడదీయండి.

  25. రూమ్ టెంపరేచర్ లో ఈ బక్లావా కేక్ ను సర్వ్ చేయండి.

Instructions
 • 1.మిల్క్ బక్లవ కేక్ ఎక్స్ ట్రా సిరఫ్ గ్రీక్ డిసర్ట్.
Nutritional Information
 • వడ్డించే పరిమాణం - 30 గ్రాములు
 • కేలరీలు - 1188
 • కొవ్వు - 80 గ్రాములు
 • ప్రోటీన్ - 18 గ్రాములు
 • కార్బోహైడ్రేట్లు - 104 గ్రాములు
 • చక్కర - 98 గ్రాములు
 • ఫైబర్ - 6 గ్రాములు
[ 3.5 of 5 - 83 Users]
Subscribe Newsletter