అసలు సిసలు నెల్లూరు చేపల పులుసు..ఇలా చేస్తే కంచం నాకేస్తారు

Posted By:

చేపల పులుసుల్లో నెల్లూరు చేపల పులుసు టేస్ట్ వేరు. మనదేశంలో చాలా ప్రాంతాల్లో చేపలతో చాలా రకాల వెరైటీలు చేస్తారు. అయితే నెల్లూరు స్టైల్ లో చేసే చేపల పులుసు టేస్ట్ మరే ఇతర చేపల పులుసుకి రాదు. నెల్లూరు చేపల పులుసు అని బోర్డు కనబడగానే కొందరు ఎగబడి ఆ హోటల్స్ కి వెళ్లి తింటుంటారు. అయితే అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేయాలని మీరు కూడా తహతహలాడిపోతుంటే ఇంట్లోనే చాలా ఈజీగా దీనిని తయారు చేసుకోవచ్చు. పాత కాలం పద్దతిలో నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

నెల్లూరు చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
-కొర్రమీను చేప
-ఉల్లిపాయ
-టమాటో
-కొత్తిమీర
-పసుపు
-కారం
-ఉప్పు
-ఆవాలు
-మెంతులు
-ధనియాలు
-జీలకర్ర
-చింతపండు
-కరివేపాకు
-వెల్లుల్లి రెబ్బలు
-పచ్చి మామాడికాయ

నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం

-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో 150 గ్రాముల చింతపండు వేసి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టండి.

-తర్వాత ఒకటిన్నర కేజీ కొర్రమీను చేపలను ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి వెడల్పుగా ఉండే పాన్ లో వేయండి.

-చేప ముక్కలలో గుప్పెడు కల్లు ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టీస్పూన్ పసుపు వేసి అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలిపి పాన్ ని పక్కనపెట్టుకోండి.

-తర్వాత మూడు ఉల్లిపాయలు, రెండు టమాటోలు, 1 పచ్చి మామాడికాయను అన్నింటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి.

-ఇప్పుడు కట్ చేసిన ఉల్లి,టమాటో,మామాడి ముక్కలను,కొంచెం కరివేపాకుని తుంచి చేప ముక్కలపై వేసుకోండి. ఇందులోనే 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్,నానబెట్టిన చింతపండు బాగా పిసికి ఆ రసం పోసుకుండి.

-తర్వాత అందులోనే అర గ్లాస్ లేదా ముప్పావు గ్లాస్ నీళ్లు పోసి స్పూన్ పెట్టి కలపండి.

-ఇప్పుడు ఆ పాన్ ని స్టవ్ మీద మీద పెట్టి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు హై ప్లేమ్ మీద,తర్వాత లో ప్లేమ్ మీద పులుసు చిక్కబడేతంవరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిట పెట్టకుండా చేతులుతో పాన్ పట్టుకొని అటు ఇటూ కుదపుతూ ఉండాలి.

-చేప ముక్కలు ఉడికిలోగా స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో అర టీస్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకొని తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత అందులోనే 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మళ్లీ గ్రైండ్ చేసుకొని ఈ మొత్తాన్ని పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ పై మూత తీసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికిందో లేదో చూడండి.

-పులుసు చిక్కబడిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టకున్న పొడి వేసి గరిట పెట్టకుండా పాన్ ని చేతులతో ఊపుి రెండు నిమిషాలు ఉడికిస్తే చాలు. గరిట అసలు ముక్కలలో పెట్టకూడదని గుర్తుంచుకోండి.

-తర్వాత ఉప్పు,కారం అన్నీ చెక్ చేసుకొని కావాలనుకుంటే తగినంత యాడ్ చేసి మూత పెట్టి మళ్లీ ఉడికించండి.

-ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడికిన తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అసలు సిసలు నెల్లూరు చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసుని చేసిన రోజు కంటే తర్వాతి రోజు తింటే అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, December 31, 2024, 19:01 [IST]
Desktop Bottom Promotion