Rava laddu: న్యూ ఇయర్ స్పెషల్..రవ్వ లడ్డు ఇలా చేసుకుంటే ఎన్నైనా తినేస్తారు

Posted By:

రవ్వ లడ్డు.. పంచదార, నెయ్యి,బొంబాయి రవ్వ, జీడిపప్పు, ఎండుద్రాక్షలతో తయారు చేసే దక్షిణ భారతీయ స్వీట్. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో దీనిని సుజీ లడూ అని పిలుస్తారు, వీటిని సాధారణంగా పండుగల సమయంలో తయారు చేస్తారు. ఈ రవ్వ లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి..నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. రవ్వ లడ్డూని స్వీట్ షాపులలో ఉంటే టేస్ట్ లా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. రవ్వ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

రవ్వ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-చక్కెర
-బొంబాయి రవ్వ
-యాలకల పొడి
-నెయ్యి
-బాదంపప్పు
-ఎండుద్రాక్ష
-జీడిపప్పు

రవ్వ లడ్డూ తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1 కప్పు బొంబాయి రవ్వ పోసి కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి దాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టి ఆరనివ్వాలి.

-తర్వాత అదే బాండీలో కొంచెం నెయ్యి వేసి కొంచెం వేడెక్కాక అందులో కట్ చేసిన బాదంపప్పు పలుకులు, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి దోరగా వేయించుకొని తీసి వేరే గిన్నెలో పెట్టుకోండి.

-ఇప్పుడు ప్లేట్ లో పక్కనపెట్టుకున్న రవ్వ ఆరిపోయి ఉంటే అందులో 1 కప్పు చక్కెర,1 టీస్పూన్ యాలకల పొడి,కొంచెం నెయ్యి పోసి మొత్తం కలిసేలా కలపి ఇందులోనే వేయించిన బాదం,జీడిపప్పు,ఎండ్రుద్రాక్షాలను,కాచి గోరువెచ్చగా ఉంచిన కొన్ని పాలు కొంచెం కొంచెం పోస్తూ కలపండి. పాలు ఎక్కువగా పోయకూడదు.

-తర్వాత ఆ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలా చేసుకోండి. అంతే రవ్వ లడ్డూ రెడీ. ఇవి వారం రోజుల దాకా నిల్వ ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Sunday, December 29, 2024, 9:00 [IST]
Desktop Bottom Promotion