For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

13 క్రిస్పీ అండ్ స్పైసీ ఫ్రైడ్ చికెన్ రిసిపిలు

|

చికెన్ వివిధ వెరైటీలతో తయారుచేయవచ్చు. చికెన్ వంటలు కొత్త రంగా వండితే చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు. సాధారణంగా తయారుచేసుకే కంటే కొంచెం డిఫరెంట్ గా తయారుచేస్తే పెద్దలు మరింత ఎక్కువగా ఇష్టపడుతారు. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవారు చికెన్ వెరైటీ వంటలను ఎక్కువగా ఇష్టపడుతారు.

ఏసీజన్ లో అయినా సరే ఇండియన్స్ స్పైసీగా ఉండే ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. బయట వాతవరణం ఎంత వేడిగా ఉన్నా స్పైసీ ఫుడ్స్ ను ఫుడ్ లేకుండా ఏమాత్రం రాజీ పడరు. ముఖ్యంగా స్పైసీగా ఉండే చికెన్ చూడగానే మనల్ని టెంప్ట్ చేసేస్తుంటాయి. చికెన్ ఫ్రై రిసిపిలు అంత సులువుగా అర్ధం కాకపోయినా, మీకోసం 13 వెరైటీ చికెన్ ఫ్రై రిసిపిలను మీకు అర్ధం అయ్యే విధంగా ఈక్రింది స్లైడ్ ద్వారా తెలియజేస్తున్నాం. కాస్త వెరైటీ, డిఫరెంట్ టేస్ట్ కలిగి ఈ చికెన్ ఫ్రై ని మీరు కూడా ప్రయత్నించి కొత్త రుచులను రుచి చూడవచ్చు...

టేస్టీ అండ్ స్పైసీ చికెన్ రిసిపి(వీడియో)

టేస్టీ అండ్ స్పైసీ చికెన్ రిసిపి(వీడియో)

సీజన్ తో సంబంధం లేకుండా మన ఇండియన్స్ హాట్ అండ్ స్పైసీ చికెన్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బయట ఎంత ఎండలున్నా, వేడిఉన్నా స్పైసీ చికెన్ తినాలనే కోరిక ఎప్పుడూ మనల్ని టెప్ట్ చేస్తుంటాయి . చికెన్ ఫ్రైని ఎప్పుడూ వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు.

చికెన్ ఆనియన్ పకోడ రిసిపి: ఈవెనింగ్ స్నాక్

చికెన్ ఆనియన్ పకోడ రిసిపి: ఈవెనింగ్ స్నాక్

చాలా మంది క్రిస్పీ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. ఈవెనింగ్ అయ్యే సరికి ఒక కప్పు కాఫీతో పాటు, ఏదైనా వేడివేడి స్నాక్స్ తినాలని కోరుకుంటాం. అందులో క్రీస్పీగా ఉండేవి ఎక్కువగా ఇష్టపడుతారు. సాధారణంగా ఈవెనింగ్ స్నాక్స్ చాలా మంది ఇష్టపడుతారు. అందులో చికెన్ ఆనియన్ పకోడను మరింత ఎక్కువగా ఇష్టపడుతారు.

స్పైసీ చికెన్ లెగ్స్ రిసిపి

స్పైసీ చికెన్ లెగ్స్ రిసిపి

స్పైసీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈవెనింగ్ స్నాక్ రిసిపి. సాధారణంగా మనం ఇంట్లో చేసుకొనే ఈవెనింగ్ స్నాక్ చాలా సింపుల్ గా తయారుచేసేసుకుంటాం.

ఫ్రైడ్ చికెన్ వాన్ టన్ స్నాక్ రిసిపి

ఫ్రైడ్ చికెన్ వాన్ టన్ స్నాక్ రిసిపి

వాన్ టెన్ ఒక బెస్ట్ ఫ్రైడ్ స్నాక్ రిసిపి. ఈ స్నాక్ ను అందరూ ఇష్టపడుతారు. ఇది ఈవినింగ్ టైమ్స్ లో తినేటటువంటి ఒక అద్భుతమైన ఫ్రైడ్ స్నాక్. ఈ స్నాక్ ను ఫ్రై చేసి లేదా ఆవిరిలో ఉడికించి తినవచ్చు . ఫ్రైడ్ వాన్ టెన్ చికెన్ రిసిపిని పచ్చిమిర్చి లేదా అల్లం సాస్ తో సర్వ్ చేస్తారు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

డ్రాగన్ చికెన్ రిసిపి: చైనీస్ స్పెషల్

డ్రాగన్ చికెన్ రిసిపి: చైనీస్ స్పెషల్

మీరు ఎప్పుడైనా చైనీస్ వంటలను ప్రయత్నించారా? డ్రాగాన్ చికెన్ ?డ్రాగాన్ చికెన్ ను చైనీస్ రెస్టారెంట్లలో తప్ప మరెక్కడా చూసి ఉండరు. ఈ మౌత్ వాటరింగ్ చికెన్ రిసిపిని కాస్త ఓపిగ్గా మనం ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. మీరు ఈ అద్భుత రుచికరమైన డ్రాగాన్ చికెన్ ను డిన్నర్ కు తయారుచేసుకోవచ్చు.

బ్రాందీ చికెన్ రెసిపీ: రొమాంటిక్ డిన్నర్ కోసం

బ్రాందీ చికెన్ రెసిపీ: రొమాంటిక్ డిన్నర్ కోసం

చికెన్ వివిధ వెరైటీలతో తయారుచేయవచ్చు. చికెన్ వంటలు కొత్త రంగా వండితే చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు. సాధారణంగా తయారుచేసుకే కంటే కొంచెం డిఫరెంట్ గా తయారుచేస్తే పెద్దలు మరింత ఎక్కువగా ఇష్టపడుతారు. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవారు చికెన్ వెరైటీ వంటలను ఎక్కువగా ఇష్టపడుతారు.

కూర్గ్ ఫ్రైడ్ చికెన్

కూర్గ్ ఫ్రైడ్ చికెన్

కూర్గ్ వంటలకు ప్రత్యేక ఫ్లేవర్ కలిగి ఉంటుంది . కూర్గ్ చికెన్ వంటలను ప్రత్యేకమైన మసాలా దినుసులతో తయారుచేస్తారు. కూర్గీ ఫ్రైడ్ చికెన్ ను ప్రత్యేకంగా తయారుచేసే కూర్గీ గరం మసాలాతో తయారుచేస్తారు. ఈ ప్రైడ్ చికెన్ ను దాల్ మరియు రైస్ కు సైడ్ డిష్ గా తయారుచేస్తారు.

హాట్ అండ్ స్పైసీ చికెన్ పెప్పర్ ఫ్రై

హాట్ అండ్ స్పైసీ చికెన్ పెప్పర్ ఫ్రై

చికెన్ పెప్పర్ కార్న్ రిసిపి ఇండియన్ నాన్ వెజ్ వంటకాల్లో స్పెషల్. ఈ పెప్పర్ చికెన్ నోరూరిస్తే స్పైసీగా తింటుంటే కళ్ళవెంబడి నీళ్ళు రావాల్సిందే. ఈ స్పెషల్ పెప్పర్ చికెన్ తయారు చేయడం చాలా సులభం. మీరు కనుక స్పైసీ ఫుడ్ ను ఇష్టపడుతున్నట్లైతే ఈ పెప్పర్ చికెన్ కొన్ని నిముషాల్లో తయారు చేసేయొచ్చు .

రుచికరమైన పాలక్ చికెన్ ఫ్రై

రుచికరమైన పాలక్ చికెన్ ఫ్రై

పాలకూర మరియు చికెన్ ఈ రెండింటి క్లాసిక్ కాంబినేషన్ చాలా అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. పాలక్ -చికెన్ ఫ్రైని ఇండియన్ మసాలాలతో తయారుచేస్తారు. చాలా సింపుల్ గా త్వరగా తయారుచేసుకోవచ్చు.

చెట్టినాడ్ చికెన్ ఫ్రై

చెట్టినాడ్ చికెన్ ఫ్రై

మన ఇండియాలో, సౌత్ స్టేట్స్ లో చెట్టినడ్ రిసిపిలు చాలా ప్రసిద్ధి. సౌత్ స్టేట్స్ లో ఒక టైన తమిళనాడు లోని శివగంగ డిస్టిక్ ప్రాంతంలో తయారుచేసే ఈ వంట చాలా పాపులర్. శివగంగా స్థలం ఒకటే ప్రసిద్ది కాదు, ఈ స్పైసీ, రుచికరమైన చెట్టినాడ్ వంటలతో పాటు, చెట్టినాడ్ శారీలు కూడా బాగా ప్రసిద్ది.

క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ : డిన్నర్ స్పెషల్

క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ : డిన్నర్ స్పెషల్

చికెన్ ను వివిధ రకాలుగా వండుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ కు ఒకరంగా, లంచ్ కు ఒక రకంగా, డిన్నర్ కు మరో రకంగా. ముఖ్యంగా డిన్నర్ కు అంటే, మరి కాస్త ఎక్కువే తినేయవచ్చు. డిన్నర్ కు తయారుచేసే ఈ స్పెషల్ క్రిస్పీ చికెన్ ను తయారుచేసుకుంటే, చాలా టేస్టీగా ఉంటుంది. కొంత మందికి చికెన్ వండటంలో రెండు మూడు వెరైటీలు తప్పు ఎక్కువ తెలుసుండకపోవచ్చు. అటువంటి వారు ఇలాంటి సులభంగా తయారుచేసే వంటలను ప్రయత్నించవచ్చు. సింపుల్ గా, చాలా త్వరగా రెడీ అయ్యే ఇటివంటి వంటను సాయంత్రం సమయంలో తయారుచేసుకోవడం డిన్నర్ కు స్పెషల్ గా ఉంటుంది.

పైనాపిల్ చికెన్

పైనాపిల్ చికెన్

స్వీట్ అండ్ సోర్ రిసిపి

పైనాపిల్ చికెన్ స్వీట్ అండ్ సోర్ మీట్ రిసిపి. చాలా మంది ఈ రిసిపి చాలా రుచిగా ఉంటుందని భావిస్తారు. ఈ రుచికకరమైన పైనాపిల్ చిక్ రిసిపి చాలా టేస్టీగా మరియు కడుపు నింపే విధంగా ఉంటుంది.

ఆంధ్ర స్టైల్ చికెన్ 65

ఆంధ్ర స్టైల్ చికెన్ 65

చికెన్ 65 చాలా ఫేమస్ స్నాక్. ఈ చికెన్ రిసిపిలకు వివిధ రకాల పేర్లు ఉంటాయి. చికెన్ 65 పేరు వెనుక పెద్ద కథ ఉంది. చికెన్ 65 వంటకాన్ని పరిచయం చేసిది 1965లో చెన్నైలో ఒక పెద్ద రెస్టారెంట్. అనుకోకుండా ఈ వంటకం పేరు మెనులో 65సార్లు కనబడింది అప్పటి నుండి దీనికి చికెన్ 65 అని పేరు .

English summary

13 Spicy Fried Chicken Recipes

Indians are known for eating hot and spicy food irrespective of the season. No matter how hot it is outside, the thought of biting into spicy chicken fry always tempts us.
Desktop Bottom Promotion