For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీఫుడ్ లవర్స్ కోసం: ఆచారి ఫిష్ టిక్కా

|

సాధారణంగా రెస్టారెంట్స్ కు వెళ్ళినప్పుడు చాలా సార్లు మీరు ఆచారి ఫిష్ టిక్కాను ఆర్డర్ చేసుంటారు. కానీ, ఈ స్పెషల్ సీఫుడ్ ను ఇంట్లో తయారుచేయాలంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది . ఆఛారి ఫిష్ టిక్ బేసిక్ గా తందూరి రిసిపి. దీన్నే మీరు తందూరి రిసిపికి బదులుగా, గ్రిల్డ్ ఫిష్ రిసిపిగా మైక్రోవోవెన్ లో తయారుచేసుకోవచ్చు. కొద్దిగా తందూరి మసాలా జోడిస్తే మరింత టేస్ట్ గా ఉంటుంది.

ఆచారి ఫిష్ టిక్కా ఇండియన్ స్నాక్స్ లో చాలా పాపులర్ అయినటువంటి రిసిపి. కాబట్టి, మీరు కాస్త శ్రమపడితే ఈ రుచికరమైన ఆచారి గ్రిల్డ్ ఫిష్ కర్రీని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు...

Achari Fish Tikka Recipe

కావల్సిన పదార్థాలు:
సుర్మై ఫిష్ ఫిల్లెట్-4 (ఒక్కో ఫిష్ ను రెండుగా భాగాలుగా కట్ చేసుకోవాలి)
నిమ్మరసం: 2tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
ఆవాలు: 1tsp
సోంపు(saunf):1/2tsp
ఉల్లిపాయ విత్తనాలు (kalonji) : 1/2tsp
మెంతులు (మెంతి): 1tsp
బ్లాక్ ఉప్పు: 1/2tsp
కారం: 1tbsp
గరం మసాలా పొడి: 1tsp
తందూరి మసాలా పొడి: 1tsp
పెరుగు 1cup
ఆవాలు ఆయిల్: 1tbsp
వెన్న: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు అన్నింటిని మిక్స్ చేసి చేపలకు పట్టించి పెట్టాలి.
3. ఇప్పుడు స్టౌమీద పాన్ పెట్టి వేడి చేసి, అందులో ఆవాలు, ఉల్లిపాయ విత్తనాలు, మెంతులు, మరియు సోంపు వేసి లైట్ గా వేగించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి.
4. ఈ పౌడర్ కు బ్లాక్ సాల్ట్ ను మిక్స్ చేసి, ఈ మొత్తం మిశ్రానికి పెరుగు జోడించి బాగా మిక్స్ చేసి అందులో ఫిష్ ఫిల్లెట్ ను వేసి బాగా పట్టించాలి. చేపముక్కలకు బాగా అంటేలా మిక్స్ చేయాలి.
5. ఇప్పుడు కారం, గరం మసాలా, మరియు తందూరి మసాలా చిలకరించి, బాగా మిక్స్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
6. అంతలోపు పాన్ లో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేసి వేడి చేసి, పక్కకు తీసుకొని గోరువెచ్చగా ఆరనివ్వాలి.
7. తర్వాత ఓవెన్ ను 250 డ్రిగ్రీలకు ఫ్రీహీట్ చేసి ఈ నూనెను బేకింగ్ డిష్ కు బటర్ మరియు ఆలివ్ ఆయిల్ రాసి అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ఫిష్ ఫిల్లెట్ ను అమర్చుకోవాలి.
8. ఇప్పుడు ఆ చేప ముక్కల మీద గోరువెచ్చగా అయినా మస్టర్డ్ ఆయిల్ ను వేసి 10-15నిముషాలు వరకూ గ్రిల్ చేయాలి.
9. అంతే అన్ని వైపులా బాగా కాలే వరకూ గ్రిల్స్ ను టర్న్ చేస్తూ ఉండాలి. ఒక 5నిముషాలు ఫిష్ ను అలాగే ఓవెన్ లో ఉంచడం వల్ల మెత్తగా ఫ్రై అవుతాయి. అంతే ఆచారి ఫిష్ టిక్కా రెడీ. సన్నగా కట్ చేసుకొన్న ఉల్లిపాయ మరియు టమోటో ముక్కలను, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు గార్నిష్ చేస్తే మరింత స్పైసీగా ఉంటుంది.

English summary

Achari Fish Tikka Recipe

You might have ordered Achari fish tikka many a times at a restaurant. But, the charm of preparing this Tandoori recipe at home is quite different. Achari fish tikka is basically a tandoori recipe. You can also prepare it as a grilled fish recipe in your microwave instead of the tandoor.
Story first published: Wednesday, March 12, 2014, 18:07 [IST]
Desktop Bottom Promotion