For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫ్ఘానీ చికెన్ పులావ్ రిసిపి : ఇండియన్ రిసిపి

|

మాంసాహారాల్లో ఎక్కువ టేస్ట్ ఉన్న వంటల్లో ఆఫ్ఘాన్ చికెన్ పులావ్ రిసిపి ఒకటి. దీన్ని తయారుచేయడం చాలా సులభం. రుచి, ఫ్లేవర్ తోనే ఇది ఒక ఆఫ్ఘాన్ నాన్ వెజ్ రిసిపి అని తెలిసిపోతుంది . చికెన్ ను మసాలా దినుసులతో పాటు ఉడికించడం వల్ల ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్ కు బాగా పట్టడం వల్ల చికెన్ మరింత టేస్ట్ గా ఫ్లేవర్ గా నోరూరిస్తుంటుంది.

READ MORE:రంజాన్ స్పెషల్ : బటర్ ఖీమా మసాల

ఈ స్పెషల్ ఆఫ్ఘానీ చికెన్ రిసిపిని రంజాన్ సమయంలో ఇఫ్తార్ డిన్నర్ సమయంలో ప్రత్యేకంగా వండించవచ్చు. ఈ పులావ్ రిసిపి చాలా టేస్టీగా మరియు సింపుల్ గా ఉంటుంది . ఈ ఆఫ్ఘానీ పులావ్ కు చికెన్ లేదా మటన్ కూడా ఉపయోగించి టేస్టీగా తయారుచేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం...ఈ స్పెషల్ నాన్ వెజ్ రిసిపిని మీరు కూడా ట్రై చేయండి....

Afghani Chicken Pulao Recipe: Indian Telugu Recipes

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1 Kg
సన్నగా కట్ చేసుకొన్న టమోటోలు: 3
రైస్: 3 Cups
వెల్లుల్లి: 4 -5 Pieces
ఉల్లిపాయలు: 3 (chopped)

అల్లం (సన్నగా తరిగి పెట్టుకోవాలి): 1 tsp

యాలకలు: 8
ధనియాలు: 1 tsp
జీలకర్ర: 1tsp
లవంగాలు: 1 tsp
కారం:1 tsp
దాల్చిన చెక్క: 3 Small
పచ్చిమిర్చి(సన్నగా తరిగినవి): 2 -3

READ MORE: రంజాన్ స్పెషల్ : సోయా హలీమ్ రిసిపి
వేడి నీళ్ళు: 5 Cups
నూనె: 2 tbsp
క్యారెట్:1(సన్నగా తరుముకోవాలి)
ఎండుద్రాక్ష: ½ Cup

తయారుచేయు విధానం:
1. ఒక పాన్ లో బాగా శుభ్రం చేసుకొన్న చికెన్, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, ధనియాలు, యాలకలు, ఉప్పు మరియు నీళ్ళు వేసి 30 నిముషాలు బాగా ఉడికించాలి.
2. తర్వాత ఉడికించుకొన్న నీళ్ళలో నుండి చికెన్ ముక్కలను వేరుగా తీసుకోవాలి.
3. చికెన్ ను ఉడికించుకొన్న నీళ్ళు కనీసం 5 కప్పులు ఉండాలి. అయితే ఇంకా ఎక్కువగా ఉన్నట్లైతే మరికొద్దిసేపు ఉడికించినట్లైతే చిక్కగా ఉడుకుతుంది.
4. ఒక పెద్ద పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

READ MORE: రంజాన్ స్పెషల్: కాశ్మీర్ మిర్చి కుర్మా రిసిపి
5. తర్వాత అందులో చికెన్ ముక్కలు, సన్నగా తరిగిన టమోటోలు, పచ్చిమిర్చి, కారం, మరియు జీలకర్ర వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే చికెన్ ఉడికించుకొన్న నీళ్ళు మరియు బియ్యం వేసి రైస్ మెత్తబడే వరకూ ఒక టైట్ మూత్ పెట్టి ఉడికించుకోవాలి.
7. తర్వాత మంట తగ్గించి మొత్తం మిశ్రమాన్ని మెత్తగా ఉడికించుకోవాలి . అంతే మీ నోరూరించే ఆఫ్ఘానీ చికెన్ పులావ్ రిసిపి రెడీ .
8. దీన్ని ఎండు ద్రాక్ష మరియు క్యారెట్ తురుముతో గార్నిష్ చేయాలి.

English summary

Afghani Chicken Pulao Recipe: Indian Telugu Recipes

Afghani Chicken Pulao Recipe: Indian Telugu Recipes, This is one of the most tasty pulao recipes and is easy to prepare. As the name indicates it is a dish from Afghanistan. The chicken in this recipe is boiled with spices first so that it retains all the flavours of the spices.
Story first published: Friday, July 17, 2015, 13:48 [IST]
Desktop Bottom Promotion