For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పులావ్

|

మాంసాహార రుచుల్ని ఎన్ని రకాలుగా వండినా అన్నిరకాల్లోనూ ఏదో ఒక డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. అందులోనే ఆంధ్ర వంటకాలంటే రుచితో పాటు కొంచెం ఘాటు కూడా ఉంటుంది. కారంగా ఉండే వంటలు తయారు చేయడం అన్నా, తినడం అన్నా ఆంధ్రావారి స్పెషల్ అని చెప్పొచ్చు. కాబట్టి మామూలుగా చేసుకొనే పులావ్ ను కొంచెం ఆంధ్రా స్టైల్లో చికెన్ కలిపి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో కోకోనట్ మిల్క్ కలపడం వల్ల కొంచెం స్వీట్ గా కారంగా తయారయ్యే ఈ వెరైటీ చికెన్ పులావ్ మీరు తయారు చేసి టేస్ట్ చూడండి...

Chicken Pulao

కావలసిన పదార్థాలు:
చికెన్: 1/2kg
బాస్మతి రైస్: 2cups
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 5-6
యాలకులు: 2
స్టార్ ఆనిస్: 1(మసాలా మొగ్గ)
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం: చిన్నముక్క
వెల్లుల్లిపాయలు: 6-10
పచ్చిమిర్చి: 4-6
కారం: 1tsp
పసుపు: 1/2tsp
ధనియాలపొడి: 1tsp
నిమ్మరసం: 1tsp
కొబ్బరి పాలు: 1/2cup
నూనె: సరిపడా
నెయ్యి: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక అందులో చెక్క, లవంగాలు, యాలకులు, మరాటి మొగ్గ వేసి లైట్ గా వేయించాలి.
2. తర్వాత అందులో కరివేపాకు వేసి ఒక నిముషం అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కులు వేసి మరో ఐదు నిముషాల పాటు మీడియం మంట మీద వేయించాలి.
3. అంతలోపు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
4. వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో శుభ్రం చేసుకొన్న చికెన్ ముక్కలను వేసి, ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి.
5. తర్వాత అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసి బాగా కలియ బెట్టాలి. తర్వాత మూత పెట్టి మంట మీడియంగా పెట్టి మరో పది నిముషాల పాటు ఉడికించుకోవాలి .
6. పది నిముషాల తర్వాత మూత తీసి అందులో కారం, పసుపు చిలకరించి చికెన్ మిశ్రమంతో బాగా కలపాలి. అలాగే నిమ్మరసం కూడా కలిపి రెండు మూడు నిముషాల పాటు ఉడికించాలి.
7. తర్వాత అందులోనే కొబ్బరి పాలు పోసి, వెంటనే శుభ్ర చేసి కడిగి పెట్టుకొన్న బాస్మతి రైస్ ను కూడా చేర్చి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి పది-పదిహేను నిముషాల తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఆంధ్ర స్టైల్ చికెన్ పులావ్ రెడీ. చికెన్ పులావ్ ను రైతా లేదా పెరుగు ఉల్లిపాయ ముక్కలతో వేడి వేడిగా సర్వ్ చేస్తే రుచికరంగా ఉంటుంది. సర్వ్ చేసే ముందు పుదీనా, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే...

English summary

Andhra Style Chicken Pulao Recipe | ఆంధ్ర స్టైల్ చికెన్ పులావ్

Chicken pulao is something that almost every non vegetarian finds delicious. And if chicken pulao is made using a scintillating Andhra recipe, then it surely sounds promising. This pulao recipe tells you how to prepare chicken pulao in the Telugu style. Most Andhra recipes have a fair amount of spices in them. This chicken pulao too is a very spicy one.
Story first published: Saturday, November 3, 2012, 16:22 [IST]
Desktop Bottom Promotion