For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్ర స్టైల్ రొయ్యల ఇగురు

|

వంటకాల్లో రొయ్య రాజసమే వేరు. టేస్టులో ‘నేనే ద బెస్ట్' అంటూ మీసం తిప్పి మరీ చెప్పేందుకే రొయ్యకు మీసాలుంటాయి. ప్లేట్‌లో నెలవంకలా మెలితిరిగి ఉండేదే రొయ్య.
రొయ్యను తినాలంటే మీసాలు తిరగక్కర్లేదు. గిన్నెలో గరిటా, వండేవారి చెయ్యీ తిరిగితే చాలు. అలా చెయ్యితిరిగేలా చెయ్యడానికే మీకోసం డిషెస్. ప్రాణం లేచివచ్చేలా ప్రాన్స్‌ను ఆస్వాదిద్దాం...
రండి... జాయినవ్వండి.

కావలసిన పదార్థాలు:
ప్రాన్స్: 500 grms
ఉల్లితరుగు: 2cup
ఏలకులు: 6
దాల్చినచెక్క: కొద్దిగా
నూనె: 1cup
పచ్చిమిర్చి: ఆరు (పొడవుగా కట్ చేయాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు
జీడిపప్పు: 10 పలుకులు
కొత్తిమీర తరుగు: 2tsp
పసుపు: చిటికెడు
గరంమసాలా: 2tsp

Royyala Eguru

గ్రేవీ కోసం:
గసగసాలు: 2tsp
జీడిపప్పు: 10 పలుకులు
పుచ్చపప్పు: 2tsp
కొబ్బరిముక్కలు: 1/2cup
వీటికి నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.

తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్‌ను శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి.
3. అందులో ఉడికించిన ప్రాన్స్, జీడిపప్పు, పావు కప్పు నీరు, గసగసాల మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి తక్కువ సెగ మీద పది నిమిషాల సేపు ఉడికించాలి.
4. ఇప్పుడు కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపి మిశ్రమం దగ్గరగా వచ్చే వరకు సన్న సెగ మీద ఉడికించాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా వడ్డించాలి.

English summary

Andhra Style Royyala Eguru | ఆంధ్ర స్టైల్ రొయ్యల ఇగురు

This is the most popular variety in Andhra.........it's also called as Andhra Royyala Eguru.......
Story first published: Saturday, April 27, 2013, 15:43 [IST]
Desktop Bottom Promotion