For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ గ్రేవీ రిసిపి

|

సౌత్ ఇండియన్ చికెన్ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటాయి. ముఖ్యంగా చికెన్ వంటలు స్పైసీగా నోరూరిస్తుంటాయి. ఈ మాంసాహారాల వంటలకు కొన్ని మసాలాలు జోడించి తయారుచేయడం వల్ల మరింత ఎక్కువ టేస్ట్ వస్తుంది.

ఈ సింపుల్ చికెన్ కర్రీ రిసిపికి పచ్చిమిర్చి, కారం, టమోటోలు అదనపు టేస్ట్ ను అందిస్తాయి. అంతే కాదు, ఈ చికెన్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. ఈ టేస్టీ చికెన్ కర్రీ రిసి చపాతీలు లేదా తందూరి రోటీలకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆంధ్రా స్టైల్లో తయారుచేస్తే హాట్ అండ్ స్పైసీగా నోరూరిస్తుంటుంది. మరి ఈ టేస్టీ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Andhra Style Spicy Chicken Gravy Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1/2kg
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొబ్బరి తురుము : 3tbsp
వెల్లుల్లి: 8-10
అల్లం: కొద్దిగా
టమోటోలు: 1 లేదా 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 4-5(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పెప్పర్: 1/2tsp
దాల్చిన చెక్క: కొద్దిగా

ఈ సండే స్పెషల్.. ఒకటి.. రెండు..కాదు మీకోసం 11వెరైటీ చికెన్ వంటలు

లవంగాలు: 4-6
గసగసాలు: 1/2tsp
కొత్తిమీర: కొద్దిగా
కారం: 2tsp
ధనియాలపొడి: 3tsp
పసుపు : 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా చికెన్ భాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.2. తర్వాత మిక్స్ జార్ లో కొబ్బరి తురుము, చెక్క, లవంగాలు, పెప్పర్, వెల్లుల్లి, ఉల్లిపాయలో సగం, అల్లం, గసగసాలు వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.3. జార్ లో కొద్దిగా నీళ్ళు పోసి, ధనియాలపొడి, కారం, పసుపు, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.4. మసాలాను రెడీ చేసుకొన్న తర్వాత స్టై మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక అందులో చికెన్ వేయాలి.5. చికెన్ ను మీడియం మంట మీద 10 నిముషాల పాటు నూనెలో ఫ్రై చేయాలి. ఉప్పు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.6. చికెన్ కొద్ది మెత్తగా వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న చికెన్ వేసి మిక్స్ చేస్తూ మరో 5నిముషాలు ఫై చేసుకోవాలి.7. చికెన్ మసాలతో పూర్తి కలిసి వేగి, మసాల పచ్చివాసన పోయి, నూనె పైకి తేలుతున్న సమయంలో సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. నాటుకోడి పులుసు -స్పైసీ ఆంధ్రా చికెన్ కర్రీ
8. గ్రేవీ చిక్కబడుతున్న సమయంలో టమోటో ముక్కలు వేసి మరో 5నిముషాలు ఉడికించుకొని, గ్రేవీ చిక్కగా అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఇది చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది కాబట్టి, వైట్ ప్లెయిన్ రైస్, గీరైస్, పులావ్, మరియు చపాతీలకు అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి...

English summary

Andhra Style Spicy Chicken Gravy Recipe

Enjoy the tempting flavors of allured Indian spices in world famous Non Vegetarian Dishes. Experience the leisure of preparing lip smacking non vegetarian recipes with different methods of preparation.
Story first published: Saturday, June 13, 2015, 13:19 [IST]
Desktop Bottom Promotion