బోన్ లెస్ చిల్లీ చికెన్: ఘాటుగా..టేస్ట్ గా!

Posted By:
Subscribe to Boldsky

మాంసాహర వంటల్లో చికెన్ వంటలు నోరూరిస్తాయి. ఎందుకంటే చికెన్ అద్భుతమైన రుచి, ఘుమఘుమల వాసన. అందుకే ప్రపంచ వ్యాప్తంగా చికెన్ వంటలకు చాలా ప్రసిద్ది. అంతే కాదు, చికెన్ వంటలను వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు. చికెన్ రిసిపిలను డిఫరెంట్ స్టైల్లో ప్రయత్నించడం చాలా సులభం.

కొంత మంది ఒకే రకమైన చికెన్ వంటలను వండటం వల్ల బోరుకొడుతుంది. ఇంట్లో వారికి కొంచె డిఫెంట్ టేస్ట్ తో ఒక చికెన్ రిసిపిని వండిపెట్టండి. వారు కొత్త రుచిని ఎంజాయ్ చేయడమే కాకుండా మీకు ప్రశంసల జల్లు కురిపిస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఆ టేస్టీ అండ్ టెంప్టింగ్ చికెన్ రిసిపిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

Boneless Chilli Chicken Recipe

బ్రాయిలర్ చికెన్ ఆరోగ్యానికి మంచిదేనా..?కొన్ని వాస్తవాలు..!

కావల్సిన పదార్థాలు :

బోన్ లెస్ చికెన్ - 350 grams (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

కార్న్ ఫ్లోర్ - ½ cup

గుడ్డు - 1 (గుడ్డులోని మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుని బాగా బీట్ చేయాలి)

వెల్లుల్లి పేస్ట్ - ½ tsp

అల్లం పేస్ట్ - ½ tsp

డీప్ ఫ్రై చేయడానికి- సరిపడా నూనె

ఉప్పు -రుచికి సరిపడా

ఉల్లిపాయలు - cups (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

సోయా సాస్ - 1 tbsp

పచ్చిమిర్చి - 2 (సన్నగా కట్ చేసుకుని, అందులోని విత్తనాలు తీసేయాలి)

వెనిగర్ - 2 tbsp

నీళ్ళు : సరిపడా

సింపుల్ గా యమ్మీ అండ్ హెల్తీ గార్లిక్ చికెన్ రైస్ ..రిసిపి

తయారుచేయు విధానం :

1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో కార్న్ ఫ్లోర్ , వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గుడ్డు, నీళ్ళు పోసి, చిక్కగా..జారుడుగా కలుపుకోవాలి.

2. ఇప్పుడు అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.

3. తర్వాత డీప్ కడాయ్ స్టౌమీద ఉంచి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన వాటిని టిష్యు పేపర్ మీద వేయడం వల్ల అదనపు నూనెను పీల్చుకుంటుంది.

ఆంధ్ర స్టైల్ చికెన్ 65

4. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులో సోయా సాస్, వెనిగర్, ఫ్రైడ్ చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని గ్రేవీలాగా కావాలనుకుంటే మీరు కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. అంతే సర్వ్ చేయడానికి బోన్ లెస్ చికెన్ రిసిపి రెడీ.

English summary

Boneless Chilli Chicken Recipe

Chilli chicken is one of the most authentic Chinese dishes that has become popular worldwide. Preparing it is quite easy and it tastes awesome.
Subscribe Newsletter