For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రాందీ చికెన్ రెసిపీ: రొమాంటిక్ డిన్నర్ కోసం

|

చికెన్ వివిధ వెరైటీలతో తయారుచేయవచ్చు. చికెన్ వంటలు కొత్త రంగా వండితే చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు. సాధారణంగా తయారుచేసుకే కంటే కొంచెం డిఫరెంట్ గా తయారుచేస్తే పెద్దలు మరింత ఎక్కువగా ఇష్టపడుతారు. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవారు చికెన్ వెరైటీ వంటలను ఎక్కువగా ఇష్టపడుతారు.

మరి బ్రాందీ ఆల్కహాలిక్ బెవరేజ్ ఉపయోగించి వెరైటీ టేస్ట్ తో తయారుచేయంచు. ఈ వాలెంటైన్ స్పెషల్ డిన్నర్ గా బ్రాందీ చికెన్ రిసిపి మీకోసం స్పెషల్ గా తయారుచేయడం అయినది మరి మీకు కూడా టేస్ట్ చేయాలంటే, తయారుచేసే పద్దతి తెలుసుకోవాల్సిందే. బ్రాందీని ఎక్కువగా మిక్స్ చేయకూడదని గుర్తించుకోండి....

Brandy Chicken Recipe For A Romantic Dinner

కావల్సిన పదార్థాలు:
చికెన్ - ½ kg (బోన్ లెస్, ఉడికించిన)
పిండి - 1 ½ cup
చికెన్ ఉడకబెట్టిన పులుసు - 1cup
బ్రాందీ - ¼cup
వెన్న(బట్టర్) - 1btsp
నిమ్మకాయ - 1 (రసం)
ఆలివ్ ఆయిల్ - 4tbsp
పార్స్లీ - ½ (సన్నగా తరిగిన)
పెప్పర్ - 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ఈ రుచికరమైన వంట తయారుచేయడానికి ముందుగా కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను పాన్ లో వేసి, కాగిన తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి మెత్తగా వేగించుకోవాలి.
2. చికెన్ లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. ఆలివ్ ఆయిల్లో చికెన్ బాగా వేగిన తర్వాత అందులో చికెన్ బర్త్(చికెన్ సూప్/చికెన్ ఉడికించిన నీరు)పోయాలి.
4. ఈ రెండింటి మిశ్రమాన్ని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి.
5. ఈ రెండు ఉడుకుతున్నప్పుడు, పాన్ లో నిమ్మరసం, బట్టర్, పెప్పర్, మరియు ఉప్పు వేసి అన్నీ కలిపి మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి.
6. మొత్తం మిశ్రమంను మీడియం మంట మీద ఉడికించుకోవాలి, ఉడుకుతున్నప్పుడు అందులో కొద్దిగా మైదా పిండి వేసి, బాగా కలియబెడుతూ ఉడికించుకోవాలి. అవసరం అయితే, చికెన్ సూప్ ను మరికొంత జోడించుకోవచ్చు.
7.పది నిముషాల తర్వాత పాన్ లో అంచుల చుట్టూ బ్రాందీని నిదానంగా పోయాలి. పోసిన తర్వాత మరో మూడు నిముషాలు ఉడికించాలి.
8. చివరగా బ్రాందీ చికెన్ ను పార్లే తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బ్రాందీ చికెన్ రెడీ.

English summary

Brandy Chicken Recipe For A Romantic Dinner

All you young married ladies, here is a treat for your new husband! Brandy is one of the alcoholic drinks many men love. If you want to make your dinner all the more romantic, then you need to try out this brandy chicken recipe.
Story first published: Thursday, February 13, 2014, 18:14 [IST]
Desktop Bottom Promotion