సింపుల్ గా యమ్మీ అండ్ హెల్తీ గార్లిక్ చికెన్ రైస్ ..రిసిపి

Posted By:
Subscribe to Boldsky

మాంసాహార ప్రియులకు చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్ తో వివిధ రకాల వంటలు వండుకుని తింటుంటారు. ముఖ్యంగా వీకెండ్స్ లో ప్రయోగాలు చేయడం ఏదో ఒక కొత్త రుచిని ఆస్వాదించడం వీరి హాబి. అయితే అలాంటి వారిలో మీరు ఒకరైతే మీకోసం ఒక స్పెషల్ చికెన్ రిసిపిని పరిచయం చేస్తున్నాం.

చాలా సింపుల్ రిసిపి. అంతే కాదు, టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఆ రిసిపి ఏంటంటే గార్లిక్ చికెన్ రిసిపి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, ఈ వంట ఒక పవర్ ప్యాక్ డిస్ గా రుచితో పాటు, ఆరోగ్యాన్ని అందిస్తుంది.

గార్లిక్ చికెన్ కాంబినేషన్ రిసిపిని మీరు ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ వంటకు కావల్సిన పదార్థాలేంటి, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

Garlic Chicken Rice Recipe

కావల్సిన పదార్థాలు:

ఉల్లిపాయలు - ¼th cup (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

బెల్ పెప్పర్(క్యాప్సికమ్) - ½ cup (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

వెల్లుల్లి రెబ్బలు- 4 (పేస్ట్ లా చేసుకోవాలి లేదా కచపచా దంచి పెట్టుకోవాలి)

రైస్ - ½ cup (బియ్యం)

వెజిటేబుల్ ఆయిల్ - 2 tbsp

నిమ్మరసం - ¼th cup

చికెన్ బ్రెస్ట్ - 1 (బోన్ లెస్ చికెన్ ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి)

అల్లం - 2 tbsp (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

సోయా సాస్ - 2 tbsp

తేనె - 1 tbsp

చికెన్ బ్రోత్ - ½ cup

పార్ల్సే- 1 tbsp ( సన్నగా తరిగిపెట్టుకోవాలి)

ఉప్పు రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, నూనె, ఉప్పు, నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని కలిపి మ్యారినేట్ చేసి 1గంట పక్కన పెట్టుకోవాలి.

2. డీప్ బాటమ్ పాన్ తీసుకుని, అందులో శుభ్రంగా కిడిగి పెట్టుకున్న బియ్యం వేయాలి. తర్వాత అందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేయాలి. తర్వాత బాగా మిక్స్ చేయాలి.

3. ఇప్పుడు అందులోనే రెడ్ బెల్ పెప్పర్ , సోయా సాస్ వేసి మరోసారి మిక్స్ చేయాలి. తర్వాత చికెన్ ఉడికించిన నీళ్ళు పోసి, మరో పది నిముషాలు ఉడికించుకోవాలి.

4. మూత తీసి రైస్ మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసి మెత్తగా ఉడికే వరకు మరోసారి ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే గార్లిక్ చికెన్ రిసిపి సర్వ్ చేయడానికి రెడీ..

English summary

Garlic Chicken Rice Recipe

Garlic Chicken Rice Recipe,Try this yummy, juicy garlic chicken rice recipe and bring on a smile on to your near and dear ones faces.
Story first published: Wednesday, May 10, 2017, 18:00 [IST]
Subscribe Newsletter