For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ మష్రూమ్ సూప్ : మాన్ సూన్ స్పెషల్

|

వర్షాకాలం ప్రారంభమైనది, వర్షం, చలితో కొన్ని పనులకు ఆటంకం, ముఖ్యంగా ఉదయం నిద్రలేవడానికి బద్దకించడం, ఆఫీసు నుండి ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకోవాలనే ఆలోచన, చిరుజల్లులకు వేడి వేడిగా కాఫీ త్రాగాలని, వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు తినాలని ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆలోచనలు మనస్సులో మెదలుతుంటాయి. అంతే కాదు వర్షకాలంలో మనల్ని ఇబ్బంది పెట్టే కొన్ని చిరుజబ్బులు జలుబు, గొంతు బొంగురపోవడం, దగ్గు, ముక్కుదిబ్బడ మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి . మరి ఈ సీజనల్ కోల్డ్ ను నివారించుకోవడానికి ఒక ఉత్తమ మార్గం కొన్ని రకాల మాన్ సూన్ సూప్ రిసిపిలను ట్రై చేయడమే . మాన్ సూన్ స్పెషల్ గా ఈరోజు మీకోసం ఒక స్పెషల్ సూప్ తయారుచేయడం జరిగింది.

చికెన్ మష్రుమ్ సూప్ వీటిలో ఉపయోగించే హెర్బ్స్ కామన్ ఫ్లూను నివారిస్తుంది. ఈ మష్రుమ్ మరియు చికెన్ సూప్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ సూప్ లో అనే ఔషదగుణగణాలు కూడా ఉన్నాయి. అంతే కాదు మీ టేస్ట్ బడ్స్ కు చాలా రుచికరంగా అనిపిస్తుంది. కాబట్టి, వర్షాకాలంలో ఇటువంటి సూపలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవేయడానికి లేదు. మరియు ఈసాయంత్రపు మీ ఆకలికోరికలను తీర్చుకోవడానికి ఇవి ఒక ఆరోగ్యకరమైన వంటలు. మరి ఈ మాన్ సూన్ స్పెషల్ సూప్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Chicken Mushroom Soup For Monsoons

కావల్సిన పదార్థాలు:

బోన్ లెస్ చికెన్: 250grms
చికెన్ స్టాక్: 4cup(చికెన్ ఉడికించిన నీళ్ళు)
మష్రుమ్: 10(ఒక మష్రుమ్ ను రెండుగా కట్ చేసుకోవాలి)
అల్లం:చిన్న ముక్క(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
చిన్న ఉల్లిపాయలు: 4(పచ్చగా ఉన్నకాడలను వేరుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
మిరియాలు: 10(పొడి చేసుకోవాలి)
తులసి: 4
కొత్తిమీర: కొద్దిగా(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
బటర్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి, 5కప్పుల నీళ్ళుపోసి 2 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత, చికెన్ సూప్ నుండి చికెన్ ముక్కలను వేరుగా తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా బటర్ వేసి కరిగిన తర్వాత, పెప్పర్ పౌడర్ వేసి ఒక సెకను ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. తర్వాత మష్రుమ్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. మీడియం మంట మీద 3-4నిమషాలు ఉడికించాలి.
6. ఇప్పుడు అందులోనే అల్లం తురుము, పచ్చిమిర్చి, గ్రీన్ ఆనియన్(ఉల్లికాడల) తరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత చికెన్ ముక్కలకు కూడా వేసి బాగా కలగలిసేలా మిక్స్ చేస్తూ, 2 నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులో 4కప్పుల చికెన్ స్టాక్(చికెన్ సూప్), రెండు కప్పుల నీళ్ళు పోసి, ఉప్పు జోడించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి మరో 10 నిముషాలు అతి తక్కువ మంట మీద ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే చికెన్ అండ్ మష్రుమ్ సూప్ రెడి. బ్రెడ్ లేదా సలాడ్స్ సైడ్ డిష్ గా వీటిని తీసుకోవచ్చు.

English summary

Chicken Mushroom Soup For Monsoons

The light Monsoon showers have started disrupting our schedule. Rain interrupts our way back from work and we end up with a runny nose. The best way to deal with this seasonal cold is to try some Monsoon soup recipes. Today, we are making chicken and mushroom soup with herbs that helps to deal common flu. This chicken and mushroom recipe is simple.
Story first published: Wednesday, July 23, 2014, 12:28 [IST]
Desktop Bottom Promotion