For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ వెజ్ సూప్- మాన్ సూన్ స్పెషల్

|

Chicken - Palak Soup for Monsoon Special
కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 1/2kg
పాలకూర తరుగు: 1cup
క్యారెట్ తరుగు: 1/2cup
బీన్స్ తరుగు: 1/2cup
వెల్లుల్లి తరుగు: 1tsp
పచ్చిమిర్చి తరుగు: 1tsp
కార్న్ ఫ్లోర్: 1tsp
నూనె : 1tsp
ఉప్పు: రుచికి తగినంత
పంచదార: 1tsp
మిరియాల పొడి: చిటికెడు
అజినమోటో: చిటికెడు
ఉల్లికాడల తరుగు:2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ మునిగేంతవరకూ నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేడిచేసి అందులో క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరగు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి.
3. ఐదు నిమిషాల తర్వాత చికెన్ ఉడికించిన నీళ్ళు, పంచదార, ఉప్పు, పాలకూర తరుగు, మిరియాల పొడి వేసి మరో పది నిమిషాలు ఉడికించికొని, స్టౌ మీద నుంచి దించేయాలి.
4. చివరిగా అజినమోటో వేసి అతిథులకు వడ్డించాలి అంతే చికెన్ పాలక్ సూప్ రెడీ...

English summary

Chicken - Palak Soup for Monsoon Special | చికెన్-పాలక్ సూప్

Healthy Spinach soup. Chicken and spinach soup - A very nutritious chicken soup made with fresh spinach leaves.
Story first published:Monday, August 6, 2012, 9:37 [IST]
Desktop Bottom Promotion