For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ : డిన్నర్ స్పెషల్

|

చికెన్ ను వివిధ రకాలుగా వండుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ కు ఒకరంగా, లంచ్ కు ఒక రకంగా, డిన్నర్ కు మరో రకంగా. ముఖ్యంగా డిన్నర్ కు అంటే, మరి కాస్త ఎక్కువే తినేయవచ్చు. డిన్నర్ కు తయారుచేసే ఈ స్పెషల్ క్రిస్పీ చికెన్ ను తయారుచేసుకుంటే, చాలా టేస్టీగా ఉంటుంది. కొంత మందికి చికెన్ వండటంలో రెండు మూడు వెరైటీలు తప్పు ఎక్కువ తెలుసుండకపోవచ్చు. అటువంటి వారు ఇలాంటి సులభంగా తయారుచేసే వంటలను ప్రయత్నించవచ్చు. సింపుల్ గా, చాలా త్వరగా రెడీ అయ్యే ఇటివంటి వంటను సాయంత్రం సమయంలో తయారుచేసుకోవడం డిన్నర్ కు స్పెషల్ గా ఉంటుంది.

ఈ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రిసిపిని చాలా సింపుల్ గా మరియు టేస్టీగా తయారుచేయవచ్చు. మసాలాలేవీ లేకుండా తయారుచేసే ఈ క్రిస్పీ చికెన్ డిన్నర్ స్పెషల్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Crispy Fried Chicken Recipe For Dinner

కావల్సిన పదార్థాలు:
కోటింగ్ 1
మైదా: 1/2cup
కోటింగ్ 2 :
గుడ్లు: 2(గిలకొట్టాలి)
పాలు: 2 cups
సోయా సాస్: 1tsp
చికెన్ సూప్ క్యూబ్: 1tsp
పార్స్లీ: 1tbsp (తాజాగా కత్తిరించినవి)
వెల్లుల్లి: పెద్దవి 2 రెబ్బలు (తురుము కోవాలి)

కోటింగ్ : 3
మైదా: 1cup
బ్రెడ్ ముక్కలు: 2 cups
వెల్లుల్లి పేస్ట్: 1/2tsp
ఉల్లిపాయ పేస్ట్: 1/4tsp
మిరపకాయ: 1/2tsp
బ్లాక్ మిరియాలు: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా

ఫ్రైయింగ్ కోసం :
నూనె - 5to 6cups
చికెన్ లెగ్స్ : 8

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో చికెన్ లెగ్స్ వేసి మీడియం మంట మీద 10నిముషాలు ఉడికించి పక్కన తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత మూడు సార్లు కోటింగ్ కోసం తీసుకొన్న పదార్థాలు, విడివిడిగా సపరేట్ సపరేట్ గా బౌల్స్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత కడాయ్ లో కొద్దిగా నూనె వేసి, మీడియం మంట మీద వేడయ్యాక అందులో అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న చికెన్ లెగ్స్ వేయాలి.
4. చికెన్ ఫ్రై చేసుకొన్న తర్వాత మొదట చికెన్ లెగ్స్ ను మొదటి కోట్ అంటే మైదపిండిని కోట్ చేయాలి మరియు మైదాలో అద్దిన ఈ లెగ్ పీసులను పాలలో డిప్ చేయాలి(2వ కోటింగ్)మరియు చివరి కోటింగ్ బ్రెడ్ పొడిలో వేసి పొర్లించాలి(3వ కోటింగ్).
5. ఇలా మూడు సార్లు కోట్ చేసిన తర్వాత మరో సారి డీప్ ఫ్రై చేయాలి. మరో ముఖ్య విషయమేంటంటే ఆ నూనె చాలా వేడిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. లేదంటే లోపల ఉడకకుండానే బయట త్వరగా మాడిపోతుంది.
6. ఇలా నిదానంగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నాప్పుడు చికెన్ లెగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కు చేరుకోగానే, వాటిని బయటకు తీసి పేపర్ టవల్ మీద ప్లేస్ చేయాలి. దాంతో అదనపు నూనె పీల్చేస్తుంది. అంతే మీ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెడీ. ఈ యమ్మీ అండ్ క్రీస్పీ చికెన్ ను టమోటో సాస్ మరియు ఉల్లిపాయ రింగ్స్ తో వేడి వేడిగా తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Crispy Fried Chicken Recipe For Dinner

One of the best recipes you can try out this evening for dinner, is the crispy fried chicken which many of you enjoy to eat. There are many people who do not know the recipe to make this delicious crispy chicken.
Story first published: Saturday, October 26, 2013, 15:56 [IST]
Desktop Bottom Promotion