For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ రిసిపి : డాబా స్టైల్

|

సాధారణంగా రోడ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు, రోడ్ మార్గం మద్యలో అక్కడక్కడా చిన్న చిన్న డాబాలు కబడుతుంటాయి. ఈ డాబాల్లో వంటలు చాలా సింపుల్ గా వెరైటీగా టేస్టీగా ఉంటాయి . ముఖ్యంగా ఇటువంటి టేస్టీ డిఫరెంట్ స్టైల్ వంటలను హైవేలల్లో ఎక్కువగా చూస్తుంటాము . డాబా స్టైల్ మటన్ రిసిపి అద్భుతమైనటువంటి నాన్ వెజిటేరియన్ డిష్. ఇది ఇండియాలో నార్త్ స్టేట్స్ లో చాలా పాపులర్ వంటకం. ఈ వంటలో సువాసనకు ఉపయోగించిన మసాలాలు మరియు మటన్ మరియు గుడ్డు, నెయ్యి ఇవన్నీ కలిపి వండిన ఈ మటన్ రిసిపి చూడగానే వెంటనే నోరూరిస్తూ రుచిచూసేయాలనిపిస్తుంది. మటన్ గ్రేవి ఒక సాంప్రదాయకరమైన వంటకం. ఇది చాలా సులభంగా తయారు చేస్తారు.

డాబా స్టైల్ వంటలు చాలా రిచ్ గా మరియు స్పైసీగా ఉంటాయి. కానీ ఈ మద్య కాలంలో డాబా స్టైల్ వంటకాలు ఇండియాలో చాలా ప్రసిద్ది చెందాయి. ముఖ్యంగా వారి స్టైల్ వంటకాలు, స్పైసీ ఫుడ్స్ చాలా ప్రసిద్ది. వీరు తయారు చేసే డాబా స్టైల్ మటన్ రిసిపి మీరు చాలా సులభంగా ప్రయత్నం చేయవచ్చు. ఇది చాలా సింపుల్ గా మరియు కారంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం...

Dabba Style Mutton Recipe

కావల్సిన పదార్థాలు:
మటన్ : 500grm(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
గుడ్లు: 6
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
టమోటో: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
బ్రెడ్ స్లైస్: 2(నీళ్ళలో నానబెట్టుకోవాలి)
డ్రై ఫ్రూట్స్(బాదం మరియు జీడిపప్పు): 3tbsp
పచ్చిమిర్చి: 6 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కారం: 1tsp
జీలకర్ర పొడి: 2tsp
మిరియాలు: 2tbsp
పెరుగు: 100grms
నెయ్యి: 1cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, జీలకర్రపొడి, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని ఒక గంట మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. గ్రేవీ తయారుచేసుకోవడం కోసం డ్రైఫ్రూట్స్ ను ముందు రోజు రాత్రే నీటిలో వేసి నానబెట్టుకొని ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ఈ పేస్ట్ ను వేగుతున్న ప్రైలో వేసి మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలను అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
5. గ్రేవీ బ్రౌన్ కలర్ లోకి మారుతున్నప్పుడు అందులో పచ్చిమిర్చి ఉప్పు మరియు టమోటో ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మటన్ ఉడికించుకోవాలి . ఎక్కువ నీరు పోయకూడదు.
6. మటన్ బాగా ఉడికి గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు అందులో ముందుగా నానబెట్టుకొన్న బ్రెడ్ వేసి మొత్తం గ్రేవీలో మిక్స్ చేయాలి.
7. ఇప్పుడు గుడ్డును పగలగొట్టి ఒక గిన్నెలోకి పోసుకొని, అందులో కొద్దిగా కారం, మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పాన్ లో వేసి ఉడికించుకోవాలి.
8. ఇలా ఉడికించుకొన్న గుడ్డును బేకింగ్ పాన్ లో అడుగు బాగంలో సర్ది, దాని మీద ముందుగా ఉడికించుకొన్న మటన్ ను వేసి సర్దాలి.
9. ఇప్పుడు ఈ మటన్ మీద గిలకొట్టి పెట్టుకొన్న మిగిలిన గుడ్డు మిశ్రమాన్ని పోయాలి. మరియు మిగిలిన నెయ్యికూడా వేసి మైక్రోవొవెన్ లో పెట్టి 5-10 బేక్ చేసుకోవాలి. అంతే డాబా స్టైల్ గోస్ట్ రెడీ ఇది రోటీ లేదా పరోటాలకు బెస్ట్ కాంబినేషన్.

English summary

Dabba Style Mutton Recipe

Dabba Gosht is one of those luxuriant recipes rich and delicious. It is an Indian mutton recipe that is popular across the sub continent in various variations. This exotic sounding name is for an interesting lamb curry recipe that is pretty basic otherwise. Owing its allegiance to the royal Mughal kitchens of the Delhi kings this spicy mutton delicacies is royal in its approach to cuisine.
Story first published: Wednesday, December 24, 2014, 18:31 [IST]
Desktop Bottom Promotion