For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన పాలక్ చికెన్ ఫ్రై

|

పాలకూర మరియు చికెన్ ఈ రెండింటి క్లాసిక్ కాంబినేషన్ చాలా అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. పాలక్ -చికెన్ ఫ్రైని ఇండియన్ మసాలాలతో తయారుచేస్తారు. చాలా సింపుల్ గా త్వరగా తయారుచేసుకోవచ్చు.

పాలకూర, మరియు చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఈ రెండింట్లో కూడా అధిక ప్రోటీనులు కలిగి ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ లో తయారుచేసే చికెన్ ఫ్రై కాస్త ఓపిగా నిధానంగా తయారుచేయడం వల్ల మసాలా దినుసులన్నీచికెన్ కు బాగా పట్టి, చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది . ఈ జ్యూసీ పాలక్ చికెన్ ఫ్రైని మీరు కూడా టేస్ట్ చేయాంటే, తయారుచేసే పద్దతిని తెలుసుకోవాల్సిందే...

Delicious Palak-Chicken Fry

కావలసిన పదార్థాలు:
చికెన్: 1/2kg
ఉల్లిపాయలు : 4
పచ్చిమిర్చి: 6
ఎండుమిర్చి: 8
పాలకూర : 150grm
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2tsp
గరం మసాలా: 1tsp(దాల్చిన చెక్క : చిన్న ముక్క, లవంగాలు : 5, ఏలకులు : 3 కలిపి పొడి చేయాలి)
పసుపు : 1/2tsp
పుదీనా : 5 రెమ్మలు
ఉప్పు : రుచికి సరిపడా
కరివేపాకు: రెండు రెమ్మలు
జీడిపప్పు: 10-15
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ను మీడియం సైజ్ లో కట్ చేసి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి.
3. ఇప్పుడు చికెన్ ముక్కలకు పసుపు, మసాలా పట్టించి స్టౌ మీద పెట్టి కొద్ది సేపు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.
4. మరో స్టౌ మీద పాన్ పెట్టి, నూనె పోసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపేస్ట్, కరివేపాకు, పుదీనా, పాలకూర వేసి వేగాక, ఉప్పు కలిపి, ఉడికిన చికెన్ ముక్కలు వేసి వేయించాలి.
5. చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దించే ముందు ధనియాల పొడి, జీడిపప్పు, కొత్తిమీర చల్లాలి. మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. అంతే పాలక్ చికెన్ రెడీ.

English summary

Delicious Palak-Chicken Fry

Delicious Palak-Chicken Fry
Story first published: Tuesday, May 13, 2014, 18:10 [IST]
Desktop Bottom Promotion