For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఘోష్ట్ కా సాలన్ : రాయల్ స్పెషల్ వంట

|

ఘోష్ట్ కా సాలన్ ఒక స్పెషల్ పాకిస్తాన్ డిష్. అయితే ఈ వంటను మన ఇండియాలో నార్త్ స్టేట్స్ లో కూడా ఎక్కువగా తయారుచేసుకుంటారు. ముఖ్యంగా మటన్ కర్రీగా పిలుచుకొనే ఈ మొఘలాయ్ కుషన్ చాలా ఫేమస్. చాలా డిఫరెంట్ టేస్ట్, ఫ్లేవర్ కలిగి ఉంటుంది . అందుకే మొఘులల కాలం నుండి షాజహాన్ వంటి మొఘలు రాజులు ఎక్కువగా ఇష్టపడే వారు.

మరి ఇలాంటి మొఘలాయ్ వంటను మన ఇండియన్స్ రుచి చూడాలంటే, అది తయారుచేసే పద్దతి తెలుసుండాలి. మీకోసం ఒక స్పెషల్ రాయల్ డిష్ ను పరిచయం చేస్తున్నాం. ఇతర ఇండియన్ మటన్ కర్రీలతో పోల్చితే ఈ ఘోష్ట్ కా సాలన్ చాలా కారంగా ఉంటుంది. మీకు అవసర అయినంత ఎక్కువ తక్కువ సరిచేసుకోవచ్చు. మరి స్పెషల్ మొఘలాయ్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Gosht Ka Salan Recipe: A Royal Treat

కావల్సిన పదార్థాలు:
మటన్: 1kg(మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
నూనె: 1/2 cup
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
అల్లం పేస్ట్ : 1tbsp(లేదా సన్నగా కట్ చేసుకోవచ్చు))
టమోటోలు: 4 (సన్నగా కట్ చేసుకోవాలి)
పెరుగు: 2 cups
పచ్చిమిర్చి : 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
కారం : 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1tsp
షహీ జీర (నల్ల మిరియాల పొడి): 1tsp
గరం మసాలా: 1tsp
కొత్తిమీర తరుగు: 2tbsp(గార్నిష్ కోసం)

తయారుచేయు విధానం :
1. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పెద్ద పాన్ లో నీళ్ళు పోసి, అందులో మటన్ ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, సగం అల్లం తరుగు, ఉప్పు, టమోటో ముక్కలు, పసుపు, మరియు కారం వేసి బాగా మిక్స్ చేసి, పాన్ స్టౌమీద పెట్టి, ఎక్కువగా మంట పెట్టి ఉడికించుకోవాలి.
3. మొత్తం మిశ్రమం ఉడుకుతున్నప్పుడు మంట తగ్గించి పెట్టుకోవాలి. మటన్ ముక్కలు మీడిం మంట మీద ఒక గంట పాటు మెత్తగా ఉడికించుకోవాలి.
4. మొత్తం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి మటన్ పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ముందుగా ఉడికించుకొన్నమటన్ ముక్కలను వేసి 15నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, మిగిలిన అల్లం తురుము కూడా వేసి మరో 3నిముషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులోనే పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
7. తర్వాత సాజీర పౌడర్ మరియు గరం మసాలా పొడి వేసి ఎక్కువ మంట మీద మరో 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
9. వేగుతున్నప్పుడు నూనె పైకి తేలే సమయంలో స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఘోట్ కా సాలన్ రిసిపి రెడీ . ఈ స్పెషల్ వంటను రైస్ లేదా పరోటాలతో సర్వ్ చేయాలి.

English summary

Gosht Ka Salan Recipe: A Royal Treat

Gosht ka salan is basically a recipe that comes from the North-Western Frontier province that is now Pakistan. In India, this mutton curry is a part of the Mughlai cuisine. It is often rumoured that gosht ka salan was the favourite dish of Mughal emperor Shah Jahan.
Story first published: Wednesday, January 21, 2015, 13:04 [IST]
Desktop Bottom Promotion