For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధికప్రోటీనులనందించే పాలక్ ఎగ్ ఫ్రై

|

Healthy and Tasty Palak Egg Fry
ఆకుకూరల్లో ప్రధానంగా పాలకూర. పాలకూరలో ఉన్న పోషకాలు మరి ఎందులోను అంత ఎక్కువగా ఉండవని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఇందులో ఉన్న పోషకాలు ఏంటో తెలుసుకుందాం. విటమిన్ ఏ, సీ, పీజు, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. పాలకూరతో చాలా వెరైటీలనే చేస్తుంటాం. సాధారణంగా ఎగ్ కర్రీ రెగ్యులర్ గా చేస్తుంటాము ఎవరమైనా.అందులోనే పాలకూర, మెంతికూర ఇలాంటివి కలిపితే కొత్తరుచితో ఫ్రై బావుంటుంది. కొంచెం వెరైటీగా ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువ వాడినట్టు ఉంటుంది.

కావలసిన పదార్ధాలు:
ఎగ్స్(కోడిగుడ్లు): 4
పాలకూర: రెండు కట్టలు
ఉల్లిపాయ: 2
పచ్చి మిర్చి: 6-8
ఉప్పు,కారం: రుచికి సరిపడా తగినంత
పసుపు: 1/2tsp
నూనె: వేయించడానికి సరిపడా
గరంమసాల పొడి: 1/2tsp
పోపుకోసం:
శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు

తయారు చేయు విధానం:
1. ముందుగా నూనె వేడి చేసి తాలింపు వేయాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి.
2. తర్వాత సన్నగా తరిగిన పాలకూర వేసి చిటికెడు ఉప్పు వేసి నీరంతా పోయేవరకూ నూనెలోనే వేయించుకొంటూ ఉడికించాలి.
3. కొద్ది సేపటి తర్వాత పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి మరికొద్దిసేపు వేయించాలి.
4. పాలకూర వేగిందని తెలియగానే గుడ్లు పగుల కొట్టి ఇందులో వేయాలి. కొంచెం ఉడికాక ఒకసారి కలిపి గరంమసాలాపొడి చల్లి పొడిపొడిగా వేయించుకోవాలి.
5. అంతే పాలక్ ఎగ్ ఫ్రై తినడానికి రెడీ. ఈ ఫ్రై అన్నం, చపాతీలలోకి చాలా బావుంటుంది. ఇందులో పాలకూర బదులు మెంతికూర కూడా వేసి చెయ్యొచ్చు.

English summary

Healthy and Tasty Palak Egg Fry | హెల్తీ సైడ్ డిష్ - పాలక్ ఎగ్ ఫ్రై

One of them was Palak Burji, a spinach stir fried with eggs. This tastes yummy ..... the recipe is just like normal egg burji .... but at the end add some 1cup chopped palak and fry it for 5 mins.... then serve hot...
Story first published:Wednesday, August 29, 2012, 17:55 [IST]
Desktop Bottom Promotion