For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాది మటన్ బిర్యానీ: వీకెండ్ స్పెషల్

|

సాధారణంగా బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన డిష్. బిర్యానీలో కూడా వివిధ రకాలుగా తయారు చేస్తారు. చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ. రుచిలో వేటికవే అద్భుత రుచి, ఒక్కో వంటకాన్నీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మటన్ బిర్యానీ చేయాలంటే వివిధ రకాల మసాల దినుసులు అవసరం అవుతాయి.

కానీ హైదరాబాదీ మటన్ బిర్యానీ చాలా సింపుల్ గా రుచికరంగా, మంచి ఫ్లేవర్ తో అతి త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇండియన్ మసాలా దినుసులతో తాయరు చేసే మటన్ బిర్యా టేస్ట్, ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి మీరూ హైదరాబాదీ మటన్ బిర్యానీ రుచి చూడాలంటే ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం...

కావలసిన పదార్ధాలు:
మాంసం - 1 kg
బాస్మతీ బియ్యం - 1 kg
ఉల్లిపాయలు -250 grms
పెరుగు - 250 grms
అల్లం వెల్లుల్లి ముద్ద - 3 tsp
కొత్తిమిర - 1/2 cup
పుదీన - 1/2 cup
పచ్చిమిర్చి - 3
పసుపు - తగినంత
కారం పొడి - 2 tsp
ఏలకులు - 4
లవంగాలు - 8
దాల్చిన చెక్క - 2
షాజీర - 2 tsp
గరం మసాలా పొడి - 2 tsp
కేసర్ రంగు - 1/4 tsp
పాలు - 1 cup
ఉప్పు తగినంత
నూనె - తగినంత

Hyderabadi Mutton Biryani

తయారు చేయు విధానం:
1. ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. అలాగే తరిగిన కొత్తిమిర ,పుదీనా కూడా. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వేయించిన ఉల్లిపాయ,కొత్తిమిర,పుదీనా,పెరుగు,కారంపొడి, పసుపు,మాంసానికి తగినంతఉప్పు వేసి మిక్సిలో మెత్తగా ముద్ద చేసుకొనిపెట్టుకోవాలి.
3. ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, నూరిన ముద్ద, పచ్చి కొత్తిమిర, పుదీనా, పచ్చిమిరపకాయలు,గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి.
4. తర్వాత బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు. మందపాటి గిన్నె తీసుకొని నూనె వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి.
5. ఇంకో పెద్ద గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు ఏలకులు,లవంగాలు,దాల్చిన చెక్క ముక్కలు, షాజీర వేయలి.
6. తర్వాత బియ్యంలోని నీరంతా వడకట్టాలి. మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే గంజి వార్చి తర్వాత సగం ఉడికిన అన్నంను మాంసంపై సమానంగా పరవాలి.పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, పుదీనా కొద్దిగా, నెయ్యి, పాలు, కేసర్ రంగు వేసి, తడిపిన గోధుమపిండిని చుట్టలాగా చేసుకుని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దానిమీద సమానమైన మూత పెట్టాలి.
7. పొయ్యిమీద ఇనప పెనం పెట్టి వేడి చేసి దానిపై ఈ గిన్నె పెట్టి దాని మీద బరువైన ఎదైనా వస్తువు పెట్టాలి. దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. అరగంట తర్వాత ఇది తయారై ఘుమఘుమలతో గోధుమ పిండిని చీల్చుకుని ఆవిరి బయటకొస్తుంది.
8. అంతే ఉడికించిన గ్రుడ్లతో అలంకరించుకోవాలి.
9. దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటాయి.

English summary

Hyderabadi Mutton Biryani

The Nizam of Hyderabad was an ex-patriot Mughal. So the Hyderbadi biryani is a mixture of the original Mughlai style biryani and the Southern, particularly Andhra cuisine. It is extremely spicy and rich.
Story first published: Saturday, March 1, 2014, 16:55 [IST]
Desktop Bottom Promotion