For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీజ్ అండ్ చికెన్ పకోడ: ఇఫ్తార్ స్పెషల్

|

రంజాన్ మాసంలో, ఇప్తార్ కోసం డిఫరెంట్ గా వంటలు చేయడం చాలా కొద్దిగా కష్టమైన పనే. అతి కొద్ది సమయంలో టేస్ట్ గా మరియు హెల్తీగా తయారుచేసుకోవాలి . అందుకోసం ఒక హెల్తీ డిష్ టేస్టీ డిష్ ను మీకోసం ఈ రోజు పరిచయం చేస్తున్నాము . చాలా తక్కువ సమయంలో ఈ స్నాక్ రిసిపిని తయారుచేసుకోవచ్చు. ఈ చీజ్ చికెన్ పకోడ చాలా రుచికరంగా మరియు పూర్తి పోషకాలను కలిగి ఉంటుంది.

చికెన్ ఇలా డిఫరెంట్ గా తయారుచేయడం అనేది క్రియేటివిటి, తగ్గ ఫలితంగా చాలా అద్భుతమైన రుచిని అందిస్తుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మరియు ఈ రోజు మీ ఇఫ్తార్ కోసం ఒక స్పెషలన్ నాన్ వెజ్ రిసిపి....

Iftaar Special: Chicken And Cheese Pakora

కావల్సిన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్ : 250 gm
బాయిల్డ్ రైస్: 300 gm
కొత్తిమీర: 1కట్ట
పచ్చిమిర్చి: 5 to 6
చీజ్ తురుము : 200 gm
ఎండు మిర్చి: 1 tbspn
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
పసుపు: 1tsp
గుడ్లు: 5
బ్రెడ్ పొడి: 6 tbsp
బేకింగ్ సోడ: 1tsp
నూనె : ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా

Iftaar Special: Chicken And Cheese Pakora

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ లో బోన్స్ అంతా చాకుతో తొలగించాలి. తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి గ్రైండర్లో లేదా మిక్సీ జార్లో వేసి మెత్తగా చేయాలి.
2. మిక్సీలో మెత్తగా చేసుకొన్న చికెన్ ను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో చీజ్ తురుము, బాయిల్డ్ రైస్ వేసి మొత్తం మిశ్రామన్ని చేత్తో కలగలుపుకోవాలి.
3. తర్వాత అందులోనే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, పసుపు, బేకింగ్ సోడ మరియు గుడ్లు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
4. చేత్తో బాగా కలిపిన తర్వాత అందులో నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకిన చిన్న చిన్న బాల్స్ లా (నిమ్మకాయంత సైజులో)రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి.
5. ఇలా మొత్తం మిశ్రమాన్ని బాల్స్ లా చేసుకొన్న తర్వాత వాటిని బ్రెడ్ పొడిలో పొర్లించి లేదా చికెన్ బాల్స్ మీద బ్రెడ్ పొడి అన్ని వైపులా చిలకరించి కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో చికెన్ బాల్స్ వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
7. అంతే చీజ్ అండ్ చికెన్ బాల్స్ రెడీ. దీన్ని సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Iftaar Special: Chicken And Cheese Pakora: Telugu Vantalu

During the month of Ramadan, preparing snacks for iftaar can be a tedious job if you have limited time left to break the fast. However, you can make some easy and healthy iftaar snacks within a limited time. This yummy cheese and chicken pakora is very nutritious and tasty.
Story first published: Sunday, June 28, 2015, 12:01 [IST]
Desktop Bottom Promotion