For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖీమా సాగ్ రిసిపి : హెల్తీ రంజాన్ రిసిపి

|

రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉంటారు. ఇలాంటి సమయంలో ఉపవాసం ముగిసిన తర్వత హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి హెల్తీ ఫుడ్స్ లో ఖీమా సాగ్ రిసిపి ఒకటి. ఎందుకంటే ఈ వంటకు ఖీమ, మరియు ఆకుకూరను ఉపయోగిస్తుంటారు.

ఇది రుచికరం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యకరమైనది కూడా...ఇందులో పూర్తి పోషకాలుండటం వల్ల ఈ ఖీమా రిసిపి ఒక ఐడియల్ రిసిపి. ఖీమా సాగ్ రిసిపి. చాలా మొత్తగా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Kheema Saag Recipe For Ramzan

కావల్సిన పదార్థాలు:
మటన్ ఖీమా- 750 grams
ఆకుకూర- 3 bunches (chopped with stems intact)
ఉల్లిపాయలు- 2 (chopped)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2tbsp
పచ్చిమిర్చి- 4 (chopped)

READ MORE: దాల్ ఖీమా రిసిపి : రంజాన్ స్పెషల్
టమోటో గుజ్జు- 2tbsp
నిమ్మరసం- 2tbsp
బిర్యానీ ఆకు- 1
పెప్పర్ కార్న్- 10 (crushed)
కారం- 1tsp
జీలకర్ర పొడి- 2tsp
ధనియాలపొడి- 2tsp
గరం మసాలా పౌడర్- 2tsp
కొత్తిమీర- 2 stalks (chopped)
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- 3tbsp

READ MORE: కల్మీ కబాబ్ రిసిపి: రంజాన్ స్పెషల్

తయారుచేయు విధానం:
1.ముందుగా ఖీమాను ఒక బౌల్లో వేసుకొని, అందులో నిమ్మరంస, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర పొడి మరియు ధనియాలపొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. అరగంట తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో బిర్యానీ ఆకు, మిరియాలపొడి, ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత, అందులో మ్యారినేట్ చేసిన ఖీమా వేసి మీడియం మంట మీద 5నిముషాలు ఉడికించుకోవాలి.
4. తర్వాత అందులో ఆకుకూర మిక్స్ చేసి ఖీమాతో బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఉప్పు వేసి మిక్స్ చేసి మూత పెట్టి మరో 10నిముషాలు ఉడికించుకోవాలి.
7. మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత గరం మసాలా మరియు కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేయాలి. అంతే ఈ ఖీమా సాగ్ రిసిపి రెడీ. దీన్ని రంజాన్ సమయంలో వేర్వ్ చేయవచ్చు.

English summary

Kheema Saag Recipe For Ramzan: Healthy Ramzan Recipe

Ramzan is the time when you are fasting for almost the entire day. This means you lose out on required calories and also become prone to acidity as your body doesn't get food. Ramzan recipes should thus be tasty as well as healthy.
Story first published: Thursday, July 2, 2015, 16:34 [IST]
Desktop Bottom Promotion